లక్ష దాటిన ఢిల్లీ కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనాతో జనం అల్లాడిపోతున్నారు. అదేస్థాయిలో దేశ రాజ‌ధాని ఢిల్లీలో వైర‌స్ క‌రాళ నృత్యం చేస్తోంది. ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య ల‌క్ష దాటింది.

లక్ష దాటిన ఢిల్లీ కరోనా కేసులు

Updated on: Jul 06, 2020 | 9:11 PM

దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనాతో జనం అల్లాడిపోతున్నారు. అదేస్థాయిలో దేశ రాజ‌ధాని ఢిల్లీలో వైర‌స్ క‌రాళ నృత్యం చేస్తోంది. ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య ల‌క్ష దాటింది. గడిచిన 24 గంట‌ల్లో 1,379 మందికి పాజిటివ్ నిర్ధార‌ణ అయినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,823కు చేరింది. ఇవాళ ఒక్కరోజే 48 మంది కొవిడ్ తో ప్రాణాలొదిలారు. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా మృతుల సంఖ్య 3,115కు చేరింది. ఇక, సోమ‌వారం క‌రోనా నుంచి 749 మంది కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు 72,088 మంది కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి ఇళ్లకు చేరుకున్నారు. అయితే, ఇవాళ 5,327 మందికి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించగా, 8,552 ర్యాపిడ్ యాంటీజెన్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారని అధికారులు వెల్లడించారు. ఈ ప‌రీక్ష‌ల సంఖ్య సోమ‌వారం నాటికి 6,57,383కు చేరిన‌ట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.