ఆప్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. ఢిల్లీని వణికిస్తున్న కరోనా మహమ్మారి తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే విశేష్ రవికి సోకింది. కరోల్‌బాగ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు బుధవారం కరోనా పరీక్షలు నిర్వహించారు. నేడు వచ్చిన ఫలితాల్లో ఆయనకు కరోనా సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. అయితే, ఆయనలో కరోనా లక్షణాలు మాత్రం కనిపించ లేదని వైద్యులు తెలిపారు. మరోవైపు.. ఆయన […]

ఆప్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..
Follow us

| Edited By:

Updated on: May 01, 2020 | 8:28 PM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. ఢిల్లీని వణికిస్తున్న కరోనా మహమ్మారి తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే విశేష్ రవికి సోకింది. కరోల్‌బాగ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు బుధవారం కరోనా పరీక్షలు నిర్వహించారు. నేడు వచ్చిన ఫలితాల్లో ఆయనకు కరోనా సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. అయితే, ఆయనలో కరోనా లక్షణాలు మాత్రం కనిపించ లేదని వైద్యులు తెలిపారు.

మరోవైపు.. ఆయన సోదరుడికి కూడా కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆయనను క్వారంటైన్ చేశారు. విశేష్ రవి ప్రస్తుతం మూడోసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. వలస కూలీలకు సంబంధించిన సహాయ కార్యక్రమాలకు సంబంధించి క్రమం తప్పకుండా తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ వస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధికి కరోనా సోకడం ఢిల్లీలో ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,515 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 59 మంది ప్రాణాలు కోల్పోయారు.