AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం.. ఏడేళ్ల బాలికపై అఘాయిత్యం.. పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన స్థానికులు

మధ్య ఢిల్లీలోని దేశబంధు గుప్తా రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ చౌకీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు స్పందించి అనుమానిత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

దారుణం.. ఏడేళ్ల బాలికపై అఘాయిత్యం.. పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన స్థానికులు
Delhi Crime
Balaraju Goud
|

Updated on: Sep 22, 2026 | 8:00 AM

Share

మధ్య ఢిల్లీలోని దేశబంధు గుప్తా రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ చౌకీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు స్పందించి అనుమానిత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

ఘటన సమాచారం స్థానికులకు తెలియడంతో చౌకీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. కొందరు ఆందోళనకారులు చౌకీని ముట్టడించడంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు అదనపు బలగాలను అక్కడికి తరలించారు. సెంట్రల్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడి పరిస్థితిని వివరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కొంతసేపటి తర్వాత స్థానికులు ఆందోళన విరమించారు.

మరోవైపు బాధిత బాలికకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు.. వారి వాంగ్మూలం ఆధారంగా పోక్సో చట్టం, ఇతర సంబంధిత చట్టపరమైన నిబంధనల కింద కేసు నమోదు చేశారు. అదుపులో ఉన్న నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

బాలికకు అవసరమైన వైద్య, ఇతర సహాయాన్ని అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ఘటనాస్థలికి సంబంధించిన వివరాలు, అందుబాటులో ఉన్న ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం దేశబంధు గుప్తా రోడ్ ప్రాంతంలో పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసు అధికారులు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా చౌకీ పరిసరాల్లో పోలీసు బలగాలను కొనసాగిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి