మర్యాద మనిషిని చూడగానే ఇవ్వాలనిపించాలి. అంతేకాని బెదిరించి తీసుకోకూడదు. తాజాగా తమకు నమస్తే పెట్టలేదనే కోపంతో డిగ్రీ విద్యార్థిని కిడ్నాప్ చేసి కర్రలతో దాడి చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో నివాసముండే మహేష్‌కుమార్‌సింగ్ శంషాబాద్‌లోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. గురువారం తన మిత్రులతో కలిసి శంషాబాద్ మండలం నానాజీపూర్‌లోని వాటర్‌ఫాల్స్ వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న కొత్తూరుకే చెందిన కొల్లంపల్లి మురారి, పల్లెల చందు, ముడావత్ వినోద్, శ్రీకాంత్ తమను చూసి కూడా నమస్తే పెట్టలేదని కోపంతో మహేష్‌కుమార్‌తో ఘర్షణకు దిగారు.
అనంతరం మహేష్‌కుమార్ అక్కడి నుంచి తన బైకుపై కొత్తూరుకు వస్తుండగా సదరు యువకులు మార్గమధ్యలో అడ్డగించి తమ బైకుపై ఎక్కించుకొని తీసుకెళ్లిపోయారు. సుమారు రెండు గంటల పాటు మండల కేంద్రంలోని వివిధ ప్రాంతాలలో తిప్పుతూ కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన మహేష్‌కుమార్ వారి నుంచి ఎట్టకేలకు తప్పించుకుని, ఇంటికి చేరుకున్నాడు. శుక్రవారం అతడు ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నలుగురు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read :
గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం, ముగ్గురు దుర్మరణం
సీఎం జగన్ ఇంట తీవ్ర విషాదం, వైఎస్ భారతి తండ్రి కన్నుమూత
ఢిల్లీలో వంగవీటి రాధా..ఏం చేస్తున్నారంటే ?