Health: రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గితే పెను సమస్యలు.. ఏకంగా కోమాలోకి

డయాబెటిక్ రోగులకు తరచుగా అధిక చక్కెర స్థాయిల సమస్య ఉంటుంది. అయితే తక్కువ చక్కెర స్థాయి కూడా అనేక సమస్యలకు దారి తీస్తుంది. రక్తంలో షుగర్ తగ్గితే.. కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎవరికైనా చక్కెర స్థాయి తరచుగా 70 mg/dl కంటే తక్కువగా ఉంటే, అది తక్కువ...

Health: రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గితే పెను సమస్యలు.. ఏకంగా కోమాలోకి
Hypoglycemia

Updated on: Feb 26, 2024 | 1:23 PM

సాధారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడాన్ని మనం షుగర్‌ వ్యాధిగా భావిస్తుంటాం. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతూ పోతే.. కళ్లు, గుండె, మూత్రపిండాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. అందుకే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే వెంటనే అలర్ట్‌ అవ్వాలని నిపుణులు చెబుతుంటారు. అయితే రక్తంలో షుగర్‌ స్థాయిలు పెరగడం ఎంత ప్రమాదకరమో, తగ్గడం కూడా తగ్గే ప్రమాదకరమణి నిపుణులు చెబుతున్నారు.

డయాబెటిక్ రోగులకు తరచుగా అధిక చక్కెర స్థాయిల సమస్య ఉంటుంది. అయితే తక్కువ చక్కెర స్థాయి కూడా అనేక సమస్యలకు దారి తీస్తుంది. రక్తంలో షుగర్ తగ్గితే.. కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎవరికైనా చక్కెర స్థాయి తరచుగా 70 mg/dl కంటే తక్కువగా ఉంటే, అది తక్కువ చక్కెరగా ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితిని హైపోగ్లైసీమియాగా పిలుస్తారు. ఇది ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా నిపుణులు చెబుతున్నారు.

తక్కువ చక్కెర స్థాయి ఉంటే ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మధుమేహానికి చికిత్స తీసుకుంటున్న వారిలో హైపోగ్లైసీమియా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. హైపోగ్లైసీమియాకు వెంటనే చికిత్స తీసుకోవాలి. సకాలంలో చికిత్ తీసుకోకపోతే.. వణుకు, దవడ గట్టిపడటం, కోమా ప్రమాదం ఉండవచ్చు. డయాబెటిక్ పేషెంట్లు తమ షుగర్‌ స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని చెప్పడానికి ఇదే కారణం.

రక్తంలో చక్కెర స్థాయి శారీరకంగా పనిచేయడానికి చాలా తక్కువగా ఉన్నప్పుడు హైపోగ్లైసీమియా వస్తుంది. ఖాళీ కడుపుతో ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అకస్మాత్తుగా చక్కెర స్థాయి పడిపోతుంది. ఏదైనా వ్యాధి కారణంగా శరీరం అధిక మొత్తంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తే, హైపోగ్లైసీమియా సంభవించవచ్చు. ఇక రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడాన్ని కొన్ని లక్షణాల ఆధారంగా తెలుసుకోవచ్చు. వీటిలో ప్రధానమైనవి.. తీవ్రమైన చెమట రావడం, క్రమరహిత లేదా హృదయ స్పందన పెరగడం, శరీరంలో అలసట, చిరాకు, జలదరింపు లేదా తిమ్మిరి, గందరగోళం, అసాధారణ ప్రవర్తన, మాట్లాడటానికి ఇబ్బంది, దృష్టి మసకబారడం వంటి సమస్యలు ఉంటాయి.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, హైపోగ్లైసీమియా పరిస్థితి ఎదురైన సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా తగ్గిపోతాయి. దీంతో వ్యక్తిలో వణుకు మొదలవుతుంది, కోమాలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. మనిషి మరణించే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో చక్కెర స్థాయి అకస్మాత్తుగా తగ్గినట్లయితే, వెంటనే 15 నుంచి 20 గ్రాముల ఫాస్ట్ యాక్టింగ్ కార్బోహైడ్రేట్లు లేదా స్వీట్ బిస్కెట్లు తీసుకోవాలి. ఇది కాకుండా, పండ్ల రసం, సోడా, తేనెను తీసుకోవాలి. దీంతో చక్కెర స్థాయిలో కవర్‌ అయ్యే అవకాశం ఉంటుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..