AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాయిబాబా భక్తులకు శుభవార్త.. ముగిసిన షిర్డీ బంద్‌!

సాయిబాబా జన్మస్థలంపై మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా షిర్డీలో జరుగుతోన్న బంద్ ముగిసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచే బంద్‌ను నిలిపివేస్తున్నట్లు షిర్డీవాసులు ప్రకటించారు. ఇవాళ సీఎం నిర్వహించనున్న సమావేశం తర్వాత తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. అంతకముందు ఆదివారం షిర్డీతో పాటుగా చుట్టుపక్కల ఉన్న 25 గ్రామాల ప్రజలు బంద్‌ పాటించారు. ఇక బంద్ సమయంలో హోటళ్లు, రెస్టారెంట్లు, ధర్మశాలలు అన్నీ కూడా మూసి ఉన్నాయి. అయితే ఆలయ దర్శనాలు, పూజలు మాత్రం […]

సాయిబాబా భక్తులకు శుభవార్త.. ముగిసిన షిర్డీ బంద్‌!
Ravi Kiran
|

Updated on: Jan 20, 2020 | 11:23 AM

Share

సాయిబాబా జన్మస్థలంపై మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా షిర్డీలో జరుగుతోన్న బంద్ ముగిసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచే బంద్‌ను నిలిపివేస్తున్నట్లు షిర్డీవాసులు ప్రకటించారు. ఇవాళ సీఎం నిర్వహించనున్న సమావేశం తర్వాత తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.

అంతకముందు ఆదివారం షిర్డీతో పాటుగా చుట్టుపక్కల ఉన్న 25 గ్రామాల ప్రజలు బంద్‌ పాటించారు. ఇక బంద్ సమయంలో హోటళ్లు, రెస్టారెంట్లు, ధర్మశాలలు అన్నీ కూడా మూసి ఉన్నాయి. అయితే ఆలయ దర్శనాలు, పూజలు మాత్రం యధావిధిగా కొనసాగాయి. అటు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆహారం, తాగునీరు తదితర సౌకర్యాలన్నింటిని కూడా స్థానికులు కల్పించారు. గ్రామస్తులు, భక్తులు ద్వారకామాయి ఆలయం నుంచి సాయి ఆలయం వరకు భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. ఇక బంద్ నేపథ్యంలో ఆదివారం నాడు భక్తుల రద్దీ కాస్త తగ్గింది.

సాయిబాబా జన్మస్థలమైన పాథ్రీలో ఉన్న ‘సాయి జన్మస్థాన్ మందిర్’ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయిస్తామని సీఎం ఉద్దవ్ థాక్రే ప్రకటించడంతో ఈ వివాదం తలెత్తింది. అయితే పాథ్రీని అభివృద్ధి చేయడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సంస్థాన్ ట్రస్ట్ మాజీ సభ్యుడు సచిన్ థాంబ్ తెలిపారు. బాబా ఎన్నడూ కూడా తన జన్మస్థలం పాథ్రీనేనని చెప్పలేదు.. అలాంటప్పుడు బాబా జన్మించింది పాథ్రీ అని ఎలా పేర్కొంటారని ఆయన ప్రశ్నించారు. సీఎం వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరారు. కాగా, ఇవాళ సీఎం ఉద్దవ్ థాక్రే షిర్డీ, పాథ్రీకి చెందిన స్థానికులు, షిర్డీ ఎమ్మెల్యే విఖే పాటిల్, ఎంపీ లోఖండే, సంస్థాన్ ట్రస్ట్ సీఈఓ దీపక్‌ ముగ్లీకర్‌‌లతో ఈ విషయంపై చర్చించనున్నారు.

Follow Us
నయనతార హ్యాపీగా జీవించాలంటే రోజుకి ఎంత కావాలి?
నయనతార హ్యాపీగా జీవించాలంటే రోజుకి ఎంత కావాలి?
చంపేస్తున్నారు.. ముక్కలుగా నరికేస్తున్నారు! వీరి మైండ్ సెట్ ఇదే
చంపేస్తున్నారు.. ముక్కలుగా నరికేస్తున్నారు! వీరి మైండ్ సెట్ ఇదే
ఆ టాలీవుడ్ స్టార్ హీరో మరదలు.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఆ టాలీవుడ్ స్టార్ హీరో మరదలు.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఆంధ్రా స్పెషల్.. ఉక్కులాంటి బలాన్నిచ్చే సూపర్ లడ్డు..
ఆంధ్రా స్పెషల్.. ఉక్కులాంటి బలాన్నిచ్చే సూపర్ లడ్డు..
నెలకు రూ.9000తో 45 ఏళ్లకే రిటైర్మెంట్.. నెలకు రూ.2 లక్షల పెన్షన్!
నెలకు రూ.9000తో 45 ఏళ్లకే రిటైర్మెంట్.. నెలకు రూ.2 లక్షల పెన్షన్!
శుభ గ్రహాల యుతి.. అదృష్టవంతులు కాబోయే రాశులివే..!
శుభ గ్రహాల యుతి.. అదృష్టవంతులు కాబోయే రాశులివే..!
పాకిస్తాన్ ప్లేయర్లకు గ్రీన్ సిగ్నల్.. భారత్‌లో ఆడేందుకు అనుమతి..
పాకిస్తాన్ ప్లేయర్లకు గ్రీన్ సిగ్నల్.. భారత్‌లో ఆడేందుకు అనుమతి..
జస్ట్ 5 నిమిషాల్లో తెలంగాణ పచ్చి పులుసు.. తెపాళ్ల లేపాల్సిందే
జస్ట్ 5 నిమిషాల్లో తెలంగాణ పచ్చి పులుసు.. తెపాళ్ల లేపాల్సిందే
అసెంబ్లీ బరిలో త్రిష ?? విజయ్ వదిలేసే స్థానం నుంచి పోటీ..!
అసెంబ్లీ బరిలో త్రిష ?? విజయ్ వదిలేసే స్థానం నుంచి పోటీ..!
గంటసేపు కారులో ఏసీ ఆన్ చేస్తే.. ఎంత పెట్రోల్ ఖర్చవుతుందో తెలుసా?
గంటసేపు కారులో ఏసీ ఆన్ చేస్తే.. ఎంత పెట్రోల్ ఖర్చవుతుందో తెలుసా?