స్కల్ బ్రేకర్ ఛాలెంజ్.. తలలు పగలుకొట్టుకుంటున్న టీనేజర్లు..!

| Edited By:

Mar 02, 2020 | 10:25 PM

బ్లూవేల్ తరహాలో యువతలో మరోకొత్త వ్యసనంతో టీనేజర్లు తలలు పగలుకొట్టుకుంటున్నారు. స్కల్ బ్రేకర్’ ఛాలెంజ్ లేదా ట్రిప్పింగ్ జంప్ పట్ల ప్రజలు ముఖ్యంగా యువత ఆకర్షితులకు కావడం ఆందోళన కలిగిస్తోందని.. విద్యార్థులు, యువత అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ తరహా చాలెంజ్ లకు ప్రచారం చేసిన వారిపై చర్యలు తప్పవని సీపీ స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో ‘ఛాలెంజ్’లు ఎక్కువైపోయాయి. అందులో చాలా చెడు చేసేవే ఎక్కువ […]

స్కల్ బ్రేకర్ ఛాలెంజ్.. తలలు పగలుకొట్టుకుంటున్న టీనేజర్లు..!
Follow us on

బ్లూవేల్ తరహాలో యువతలో మరోకొత్త వ్యసనంతో టీనేజర్లు తలలు పగలుకొట్టుకుంటున్నారు. స్కల్ బ్రేకర్’ ఛాలెంజ్ లేదా ట్రిప్పింగ్ జంప్ పట్ల ప్రజలు ముఖ్యంగా యువత ఆకర్షితులకు కావడం ఆందోళన కలిగిస్తోందని.. విద్యార్థులు, యువత అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ తరహా చాలెంజ్ లకు ప్రచారం చేసిన వారిపై చర్యలు తప్పవని సీపీ స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో ‘ఛాలెంజ్’లు ఎక్కువైపోయాయి. అందులో చాలా చెడు చేసేవే ఎక్కువ ఉన్నాయి. లేటెస్టుగా ఎముకలు విరగ్గొట్టుకునే చాలెంజ్ నెట్ లో వైరల్ అవుతోంది. మెక్సికో సహా దక్షిణ అమెరికా, యూరప్ దేశాల్లో స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం మన దేశంలో సోషల్ మీడియాలో స్కల్ బ్రేకర్’ ఛాలెంజ్ లేదా ట్రిప్పింగ్ జంప్ ఛాలెంజింగ్ స్టంట్ వైరల్ అవుతోంది. యువత ఈ ఛాలెంజ్ భారిన పడే అవకాశముందని తల్లిదండ్రులు, టీచర్లు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు.

[svt-event date=”02/03/2020,10:07PM” class=”svt-cd-green” ]