ప్రధాని మోదీ అనూహ్య నిర్ణయం..ఇకపై నో సోషల్ మీడియా..!
ప్రధాని మోదీ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికల నుంచి తన అకౌంట్‌ను వచ్చే ఆదివారం తొలగించే యోచనలో ఉన్నట్లు ట్వీట్ చేశారు. ప్రధాని మోదీని ఫేస్‌బుక్‌లో 4 కోట్ల 47 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా 3 కోట్ల 52 లక్షల మంది ఫాలో అవుతుండగా, ట్విటర్ ద్వారా 5 కోట్ల 33 లక్షల మంది అనుసరిస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్లన్నింటిని కలుపుకుంటే దాదాపు […]
ప్రధాని మోదీ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికల నుంచి తన అకౌంట్‌ను వచ్చే ఆదివారం తొలగించే యోచనలో ఉన్నట్లు ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీని ఫేస్‌బుక్‌లో 4 కోట్ల 47 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా 3 కోట్ల 52 లక్షల మంది ఫాలో అవుతుండగా, ట్విటర్ ద్వారా 5 కోట్ల 33 లక్షల మంది అనుసరిస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్లన్నింటిని కలుపుకుంటే దాదాపు 15 కోట్ల మంది ప్రధానిని ఫాలో అవుతున్నారు. అంతటి ఫాలోయింగ్ ఉన్న ప్రధాని మోదీ.. సోషల్ మీడియా నుంచి తప్పుకుంటానని అనూహ్యంగా నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
This Sunday, thinking of giving up my social media accounts on Facebook, Twitter, Instagram & YouTube. Will keep you all posted.
— Narendra Modi (@narendramodi) March 2, 2020