తరుముకొస్తున్న బురేవి తుఫాన్.. తమిళనాడులో రెడ్ అలర్ట్.. ముందస్తు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం

|

Dec 03, 2020 | 12:21 AM

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారింది. సైక్లోన్‌ శ్రీలంకలోని ట్రింకోమలీకి తూర్పు-ఆగ్నేయంగా..

తరుముకొస్తున్న బురేవి తుఫాన్.. తమిళనాడులో రెడ్ అలర్ట్.. ముందస్తు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం
Follow us on

తమిళనాడు వరుణుడు వెంటాడుతున్నాడు. వరస తుఫాన్లతో సముద్ర తీర ప్రాంత జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. తాాజాగా బురేవి తుఫాన్ మరింత భయపెడుతోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారింది. సైక్లోన్‌ శ్రీలంకలోని ట్రింకోమలీకి తూర్పు-ఆగ్నేయంగా 370, పంబన్‌కు 600, కన్యాకుమారికి 770 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

రాబోయే 12గంటల్లో ఇది మరింత బలపడుతుందని వాతావరణ కేంద్రం(IMD) అధికారులు తెలిపారు. బుదవారం రాత్రి ట్రింకోమలి దగ్గరలో తీరం దాటి.. గురువారం గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌, కొమొరిన్‌ ప్రాంతం నుంచి పశ్చిమ – నైరుతి దిశగా తిరిగి ఈ నెల 4వ తేదీన దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి-పంబన్‌ తీరాన్ని తాకుతుందని స్థానిక తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్‌ పువిరసన్‌ వెల్లడించారు.

తుఫాన్‌ ప్రభావంతో బుధ, గురువారాల్లో తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, రామనాథపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. రామనాథపురం, తిరునెల్వేలి, తెన్కాసి, తూత్తుకుడి, కన్యాకుమారి, పుదుకొట్టై, శివగంగై, విరుద్‌నగర్‌ మీదుగా 50-70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. అయితే ఈ ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ పై లేనప్పటికీ.. కొన్ని తీర ప్రాంత జిల్లాల్లో మోస్తారు వర్షాలుకురిసే అవకాశం ఉంది.