Cyber crime: యువతికి అసభ్య మెసేజ్‌లు, ఫోటోలు… యువకుడి అరెస్ట్

Cyber crime: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్న… మహిళల పట్ల వేధింపులు మాత్రం ఆగడం లేదు. తాజాగా యువతికి అసభ్యకర మెసేజులు, ఫోటోలు పంపిస్తున్న యువకుడ్నిరాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తమిళనాడు తిరువణ్ణామలైలో ఇంజినీరింగ్‌ చదువుతున్న 25 ఏళ్ల యువకుడు, స్థానికంగా నకిలీ ధ్రువపత్రాలతో పలు ప్రీ ఆక్టివేటెడ్‌ సిమ్‌లను సంపాదించాడు. వాటిని ఉపయోగించి నగలు, చీరలు అమ్మే విక్రేతగా ఓ వాట్సాప్‌ గ్రూపు సృష్టించి మహిళల […]

Cyber crime: యువతికి అసభ్య మెసేజ్‌లు, ఫోటోలు... యువకుడి అరెస్ట్

Edited By:

Updated on: Feb 26, 2020 | 10:57 AM

Cyber crime: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్న… మహిళల పట్ల వేధింపులు మాత్రం ఆగడం లేదు. తాజాగా యువతికి అసభ్యకర మెసేజులు, ఫోటోలు పంపిస్తున్న యువకుడ్నిరాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తమిళనాడు తిరువణ్ణామలైలో ఇంజినీరింగ్‌ చదువుతున్న 25 ఏళ్ల యువకుడు, స్థానికంగా నకిలీ ధ్రువపత్రాలతో పలు ప్రీ ఆక్టివేటెడ్‌ సిమ్‌లను సంపాదించాడు. వాటిని ఉపయోగించి నగలు, చీరలు అమ్మే విక్రేతగా ఓ వాట్సాప్‌ గ్రూపు సృష్టించి మహిళల ఫోన్‌నంబర్లు సేకరించాడు.

ఈ క్రమంలో నగరంలోని మల్కాజిగిరికి చెందిన ఓ యువతి నంబరును సంపాదించి.. ఆమెతో చాట్ చేయడం ప్రారంభించాడు. అయితే ఆమెకు అసభ్యకరమైన మెసేజులు, ఫోటోలు పంపించడం ప్రారంభించాడు. వాట్సాప్‌లో పెట్టిన ఆమె ఫోటోను అభ్యంతరకరంగా ప్రదర్శించాడు. లైంగికంగా ఆమెను వేధించాడు. దీంతో బాధితురాలి సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా.. సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్దనున్న సదరు నిందితుడిని మంగళవారం అరెస్టుచేసి రిమాండుకు తరలించారు. యువతులు, బాలికలు వాట్సాప్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో తమ పర్సనల్ ఫోటోలు, సమాచారాన్ని ఉంచవద్దని పోలీసులు తెలిపారు.