ఈ కామర్స్ సంస్థల డేటా లీక్.. నలుగురు బీహారీ గ్యాంగ్ అరెస్ట్!

|

Jan 03, 2020 | 1:59 PM

ఈ కామర్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్నాప్‌డీల్, క్లబ్ ఫ్యాక్టరీ, అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల నుంచి ఈ ముఠా డేటాను సేకరించి వినియోగదారులకు గాలం వేస్తున్నారు. ఫ్రీ గిఫ్ట్స్ పేరుతో అమాయకుల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులను వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇక దీనిపై దృష్టి సారించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈ గ్యాంగ్‌కు చెందిన నలుగురు బీహారీ సభ్యులను అరెస్ట్ చేసి […]

ఈ కామర్స్ సంస్థల డేటా లీక్.. నలుగురు బీహారీ గ్యాంగ్ అరెస్ట్!
Follow us on

ఈ కామర్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్నాప్‌డీల్, క్లబ్ ఫ్యాక్టరీ, అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల నుంచి ఈ ముఠా డేటాను సేకరించి వినియోగదారులకు గాలం వేస్తున్నారు. ఫ్రీ గిఫ్ట్స్ పేరుతో అమాయకుల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులను వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇక దీనిపై దృష్టి సారించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈ గ్యాంగ్‌కు చెందిన నలుగురు బీహారీ సభ్యులను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.

దీనిపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ ‘ఈ కామర్స్ సంస్థల డేటా ఆధారంగా ఈ నలుగురు నిందితులు అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. స్నాప్‌డీల్‌లో ఓ మహిళ పొటాటో కట్టర్ కొనుగోలు చేస్తే.. వీరిలో ప్రధాన నిందితుడైన సందీప్ కుమార్ ఆమెకు ఫోన్ చేసి మొదటి బహుమతిగా 6 లక్షల 90 వేలు విలువ జేసే కారు పొందారని నమ్మించాడు. ఇక ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పేరుతో రూ.2.30 లక్షలు జమ చేయాలని చెప్పి బాధితురాలును మోసం చేశారు. స్నాప్‌డీల్ పేరుతో ఫేక్ టోల్ ఫ్రీ నెంబర్ సృష్టించి ఈ నలుగురూ మోసాలకు పాల్పడుతున్నారు. ప్రధాన నిందితుడు సందీప్ కుమార్‌తో పాటు మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశాం. సుమారు రూ.5 కోట్ల వరకు మోసం చేసినట్లు విచారణలో తేలింది. 12 మొబైల్స్, 2 ల్యాప్‌టాప్స్, ఒక స్కానర్ ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నాం.

కాగా, ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ నుంచి కాల్స్ వస్తే ఒకటికి రెండుసార్లు చెక్ చేయాలని ప్రజలకు సూచనలు ఇచ్చిన సజ్జనార్.. ప్రైజ్ వచ్చిందంటూ మెసేజ్‌లు వస్తే నమ్మవద్దని స్పష్టం చేశారు.