పేటిఎం కెవైసి అంటూ రూపాయి డిపాజిట్ చేయమంటారు.. ఆపై..

|

Oct 13, 2020 | 4:37 PM

పేటిఎం కోసం కెవైసి అప్డేట్ అంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. జార్ఖండ్ రాష్ట్రం జంతార జిల్లా కేంద్రంగా ఈ మోసాలు జరుగుతున్నట్లు గుర్తించామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. వీళ్లంతా “పేటియం ఆప్ డౌన్లోడ్ పేరుతో డెబిట్ క్రెడిట్ కార్డుల నుండి ఒక రూపాయి డిపాజిట్ చెయ్యాలి అని కోరుతారు.. ఆ తరవాత వారి రిమోట్ యాక్సెస్ తో లక్షల రూపాయలు కొట్టేస్తున్నారు. వినయ్ శర్మ అనే బాధితుడి నుంచి 4లక్షల […]

పేటిఎం కెవైసి అంటూ రూపాయి డిపాజిట్ చేయమంటారు.. ఆపై..
Follow us on

పేటిఎం కోసం కెవైసి అప్డేట్ అంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. జార్ఖండ్ రాష్ట్రం జంతార జిల్లా కేంద్రంగా ఈ మోసాలు జరుగుతున్నట్లు గుర్తించామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. వీళ్లంతా “పేటియం ఆప్ డౌన్లోడ్ పేరుతో డెబిట్ క్రెడిట్ కార్డుల నుండి ఒక రూపాయి డిపాజిట్ చెయ్యాలి అని కోరుతారు.. ఆ తరవాత వారి రిమోట్ యాక్సెస్ తో లక్షల రూపాయలు కొట్టేస్తున్నారు. వినయ్ శర్మ అనే బాధితుడి నుంచి 4లక్షల 29 వేలు కొట్టేశారు. జార్ఖండ్ చెందిన నంకు మండల్ అలియాస్ రాహుల్ , రాజేష్ మండల్, శివశేక్తి కుమార్ అలియాస్ అమిత్ బర్నల్, గౌరవ్ అరుణ్ , దిల్ ఖుష్ కుమార్ సింగ్ లను అరెస్ట్ చేశాం. నిందితుల నుంచి 1లక్ష 47 వేల నగదు, మొబైల్ ఫోన్లు డెబిట్, క్రెడిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నాం. నింధితులంతా సైబర్ నేరాలు చెయ్యడం లో ఆరితేరారు”. అని సీపీ వెల్లడించారు.