
Crime In Hyderabad: హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో పేలుడు కలకలం సృష్టించింది. రిసాలగడ్డ కల్లూ కాంపౌండ్ పరిధిలో ఉన్న ఓ చెత్త బాక్స్‌లో ఈ బ్లాస్ట్ సంభవించింది. భారీగా శబ్దం వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ పేలుడులో నాగయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడమే కాకుండా కాళ్లు, చేతులు తెగిబడ్డాయి. స్థానికులు హుటాహుటిన అతడ్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. కాగా, వారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.