దర్యాప్తు మరింత ముమ్మరం…రెజ్లర్ సుశీల్ కుమార్ ను హరిద్వార్ తీసుకువెళ్లిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు

రెజ్లర్ సాగర్ రానా హత్య కేసులో ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ ను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోమవారం హరిద్వార్ కి తీసుకువెళ్లారు. సాగర్ హత్య తరువాత ఇతడు హరిద్వార్ కు పారిపోయి అక్కడ తలదాచుకుని ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

దర్యాప్తు మరింత ముమ్మరం...రెజ్లర్ సుశీల్ కుమార్ ను హరిద్వార్  తీసుకువెళ్లిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు
Crime Branch Police Takes Sushil Kumar To Haridwar

Edited By: Anil kumar poka

Updated on: May 31, 2021 | 3:23 PM

రెజ్లర్ సాగర్ రానా హత్య కేసులో ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ ను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోమవారం హరిద్వార్ కి తీసుకువెళ్లారు. సాగర్ హత్య తరువాత ఇతడు హరిద్వార్ కు పారిపోయి అక్కడ తలదాచుకుని ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. తన మొబైల్ ఫోన్ ను, నేరం జరిగిన రోజున తాను ధరించిన దుస్తులను ఇక్కడే దాచి ఉండవచ్చునని కూడా వారు అనుమానిస్తున్నారు. 18 రోజుల పరారీ కాలంలో ఇతగాడు తను అరెస్టు కాకుండా ఉండేందుకు సుమారు ఏడు రాష్ట్రాలు, చివరకు కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా క్రాస్ చేశాడని పోలీసులు చెప్పారు. పైగా ఎప్పటికప్పుడు తన సిమ్ కార్డులను మారుస్తూ వచ్చాడట. సాగర్ హత్య కేసుకు సంబంధించి ఖాకీలు ఇప్పటివరకు 9 మందిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు ఇంకా పరారీలో ఉన్నారు. వారిని కూడా త్వరలో పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. సుశీల్ కుమార్ ని మొదట కోర్టు 6 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. అయితే వారి విజ్ఞప్తిపై కస్టడీని మరో నాలుగు రోజులు పొడిగించింది. అసలు విచారణలో సుశీల్, అతని స్నేహితుడు అజయ్ కుమార్ తమకు సహకరించడం లేదని, అందువల్ల వారిని 12 రోజలపాటు కస్టడీకి ఇవ్వాలని ఖాకీలు కోరారు.

హరిద్వార్ లో సుశీల్ కుమార్ తనకు తెలిసిన ఓ బాబా ఆశ్రమంలో కొన్ని రోజులు దాక్కున్నాడని స్థానిక పత్రికలు కొన్ని ఆ మధ్య పేర్కొన్నాయి. అయితే అక్కడి నుంచి కూడా రిషికేష్ కి పరారయ్యాడని కూడా ఈ పత్రికలు పేర్కొన్నాయి. తన వద్ద డబ్బు అయిపోవడంతో చివరకు మళ్ళీ చేరుకొని సుశీల్ కుమార్ పోలీసులకు పట్టుబడిపోయాడు.

మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ : Viral Video : పెళ్లిరోజు వధువును చూసి షాకైన వరుడు..!కాబోయే వాడిని భ‌లే బురిడీ కొట్టించిన యువ‌తి.. ఆక‌ట్టుకుంటోన్న ప్రాంక్ వీడియో..

 విద్యుత్‌ తీగలపై వాక్‌చేస్తోన్న శునకం.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో.: Dog Viral video.

పర్సనల్ నంబర్ అడిగిన నెటిజన్.. రేణు దేశాయ్ స్ట్రాంగ్ ఆన్సర్ వైరల్ వీడియో : Renu Desai Viral video.

నాగ్ పూర్ లో చిరుత కలకలం స్థానికులను హడలెత్తిన చిరుత.వైరల్ గా మారిన వీడియో: Leopard spotted viral video.