AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డైట్ విద్యార్థుల్ని ఆదుకోండి.. జగన్ కు సిపిఐ రామకృష్ణ లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. 2018 - 2020 కి సంబంధించి డైట్ కళాశాలల్లో మేనేజ్ మెంట్ కోటా కింద చేరిన విద్యార్థులను పరీక్షలకు అనుమతించేందుకు..

డైట్ విద్యార్థుల్ని ఆదుకోండి.. జగన్ కు సిపిఐ రామకృష్ణ లేఖ
Pardhasaradhi Peri
|

Updated on: Sep 15, 2020 | 7:02 PM

Share

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. 2018 – 2020 కి సంబంధించి డైట్ కళాశాలల్లో మేనేజ్ మెంట్ కోటా కింద చేరిన విద్యార్థులను పరీక్షలకు అనుమతించేందుకు చర్యలు చేపట్టండని ఆలేఖలో కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 531 డైట్ కళాశాలల్లో 35 వేల మంది విద్యార్థులు మేనేజ్ మెంట్ కోటా కింద చేరారని.. ఒక్కో విద్యార్థి రు.50 వేల నుండి లక్ష రూపాయల వరకు కళాశాల యాజమాన్యాలకు ఫీజులు కట్టడం జరిగిందని సీఎంకు విన్నవించారు. ఈనెల 28 నుండి నిర్వహించే పరీక్షలు కేవలం కౌన్సిలింగ్ ద్వారా ఎంపికైన విద్యార్థులకు మాత్రమే నిర్వహిస్తామనటంతో మేనేజ్ మెంట్ కోటా కింద కళాశాలల్లో చేరి విద్యాసంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులు అగమ్యగోచరంలో పడ్డారని రామకృష్ణ వివరించారు. మేనేజ్ మెంట్ కోటా కింద విద్యాభ్యాసం పూర్తి చేసిన విద్యార్థులు నష్టపోకుండా రెగ్యులర్ విద్యార్థులతో కలిసి పరీక్షలు రాసేందుకు అనుమతించాలని ఆయన సీఎంకు రాసిన లేఖలో అభ్యర్థించారు.

Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్