5

ఏపీ పశుసంవర్ధక శాఖ మంత్రిపై తిరగబడ్డ ఆవు.!

ఏపీ పశుసంవర్ధక శాఖ మంత్రి అప్పల్రాజుకు తృటిలో ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా చదలవాడలో ఉన్న పశుక్షేత్రాన్ని మంత్రి అప్పల్రాజు పరిశీలించి అనంతరం గోపూజ చేస్తుండగా బెదిరిపోయిన ఆవు మంత్రిపై దూకేందుకు ప్రయత్నించింది. మంత్రిపై కొమ్ములు విసిరింది… వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆవును అదుపుచేయడంతో ప్రమాదం తప్పింది… ఆవు కొమ్ములు విసురుతున్న సమయంలో మంత్రి చాకచక్యంగా వెంటనే వెనక్కి దూరంగా జరిగారు. గన్‌మెన్లు, ఇతర సిబ్బంది ఆవును అదుపులోకి తెచ్చి దూరంగా తీసుకెళ్ళారు. ఈ ఘటనలో ఎవరికీ […]

ఏపీ పశుసంవర్ధక శాఖ మంత్రిపై తిరగబడ్డ ఆవు.!
Follow us

|

Updated on: Nov 11, 2020 | 3:09 PM

ఏపీ పశుసంవర్ధక శాఖ మంత్రి అప్పల్రాజుకు తృటిలో ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా చదలవాడలో ఉన్న పశుక్షేత్రాన్ని మంత్రి అప్పల్రాజు పరిశీలించి అనంతరం గోపూజ చేస్తుండగా బెదిరిపోయిన ఆవు మంత్రిపై దూకేందుకు ప్రయత్నించింది. మంత్రిపై కొమ్ములు విసిరింది… వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆవును అదుపుచేయడంతో ప్రమాదం తప్పింది… ఆవు కొమ్ములు విసురుతున్న సమయంలో మంత్రి చాకచక్యంగా వెంటనే వెనక్కి దూరంగా జరిగారు. గన్‌మెన్లు, ఇతర సిబ్బంది ఆవును అదుపులోకి తెచ్చి దూరంగా తీసుకెళ్ళారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆవుకు గోపూజ చేస్తున్న సందర్భంలో ఈ సంఘటన జరిగింది. అనంతరం మంత్రి అప్పల్రాజు మాట్లాడుతూ అరుదైన ఒంగోలు, పుంగనూరు జాతి ఆవులను సంరక్షించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని తెలిపారు. పుంగనూరు జాతి ఆవుల పరిరక్షణ కోసం 70 కోట్లు మంజూరు చేశామన్నారు. ఎపి అమూల్‌ ప్రాజెక్టు ఈనెల 25న లాంచ్‌ చేస్తున్నామని, అందులో భాగంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న పశుక్షేత్రాలను పరిశీలిస్తున్నామని మంత్రి అప్పల్రాజు తెలిపారు.