హర్యానాలో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

| Edited By:

May 03, 2020 | 9:51 PM

కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. హర్యానా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ -19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను

హర్యానాలో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు
Follow us on

Corona cases in Haryana: కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. హర్యానా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ -19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను హర్యానా ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఆదివారం సాయంత్రం నాటికి అందిన సమాచారం మేరకు హర్యానా రాష్ట్రంలో కొత్తగా మరో 66 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రటించింది.

కాగా.. ఇప్పటి వరకు మొత్తం 442 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కరోనా నుంచి ఇప్పటి వరకు 245 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. కరోనా వల్ల ఇప్పటి వరకు 5గురు మృతి చెందారు.

Also Read: గుడ్ న్యూస్: నెల రోజుల్లో కరోనా వ్యాక్సిన్.. భారత్ నుంచే..!