#covidindia కరోనా టెస్టులిక హైదరాబాద్‌లోనే..

|

Mar 17, 2020 | 5:36 PM

కరోనా పరీక్షల రిపోర్టుల కోసం ఇక పుణెపై ఆధారపడే పరిస్థితిని మార్చేసింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్‌లోనే ఆరు ల్యాబొరేటరీలను నెలకొల్పినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. కరోనా పాజిటివ్ ఫైనల్ రిపోర్ట్ ఇకపై హైదరాబాద్ లోనే...

#covidindia కరోనా టెస్టులిక హైదరాబాద్‌లోనే..
Follow us on

Covid-19 tests in Hyderabad only: కరోనా పరీక్షల రిపోర్టుల కోసం ఇక పుణెపై ఆధారపడే పరిస్థితిని మార్చేసింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్‌లోనే ఆరు ల్యాబొరేటరీలను నెలకొల్పినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. కరోనా పాజిటివ్ ఫైనల్ రిపోర్ట్ ఇకపై హైదరాబాద్ లోనే.. పూణే కు పంపాల్సిన అవసరం లేదని ఆయన ప్రకటించారు. మంగళవారం ఈ ఆరు ల్యాబులు ప్రారంభమయ్యాయని ఆయన వెల్లడించారు. ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు రాజేందర్.

క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటుపై కూడా ఎవరూ ఆందోళన చెయ్యాల్సిన అవసరం లేదని రాజేందర్ తెలిపారు. ఇటలీ నుండి వచ్చి.. కరోనా పాజిటివ్‌గా నమోదైన మహిళ పాటుతో ప్రయాణం చేసిన 42 మందికి వైద్య పరీక్షలు పరీక్షలు చేసినట్లు ఆయన చెప్పారు. తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసులు అయిదుకు చేరాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో కరోనా వైరస్ కట్టడి కోసం కమాండ్ కంట్రోల్ సిస్టమ్ నిరంతరం పని చేస్తోందన్నారు రాజేందర్.

ఇకపై ప్రతి రోజు మూడు పూటలా కరోనా బులిటెన్స్ విడుదల చేస్తామని, ఇప్పటి వరకు స్థానికంగా వున్న వారెవరికీ కరోనా సోకలేదు… కేవలం విదేశాలకు వెళ్ళి వచ్చిన వారికే కరోనా సోకిందని చెప్పారు ఈటల. కరోనా పాజిటివ్ కేసుల వివరాలను వెల్లడించిన మంత్రి… దుబాయి, ఇటలీ, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, ఇండోనేషియా నుంచి వచ్చిన అయిదుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు.