నిఘా నేత్రం ! ప్రతి భారతీయుడిపైనా మోదీ సర్కార్ కన్ను !

ఇండియాలోని కోట్లాది ప్రజలు  తమపై ఎవరి నిఘా లేదని,  తమ ప్రైవసీకి ఏ మాత్రం ఢోకా లేదని భావించడానికి వీల్లేదు. అలా జబ్బలు చరచుకోవడానికి అవకాశం లేదు. ఇక అనుక్షణం ఓ 'నిఘా నేత్రం' వారిని 'వెన్నాడుతూనే' ఉంటుంది.

నిఘా నేత్రం ! ప్రతి భారతీయుడిపైనా  మోదీ సర్కార్ కన్ను !

ఇండియాలోని కోట్లాది ప్రజలు  తమపై ఎవరి నిఘా లేదని,  తమ ప్రైవసీకి ఏ మాత్రం ఢోకా లేదని భావించడానికి వీల్లేదు. అలా జబ్బలు చరచుకోవడానికి అవకాశం లేదు. ఇక అనుక్షణం ఓ ‘నిఘా నేత్రం’ వారిని ‘వెన్నాడుతూనే’ ఉంటుంది. ప్రతి వ్యక్తి డేటాను ట్రాక్ చేయడానికి ఆధార్ ను వినియోగించుకునేలా ప్రధాని మోదీ ప్రభుత్వం ఓ ‘ఆటో అప్ డేటింగ్ సెర్చబుల్ డేటా బేస్ తో కూడిన’ వ్యవస్థను ఏర్పాటు చేయబోతోందట. ఇంటర్నెట్ గవర్నెన్స్ రీసెర్చర్ అయిన శ్రీనివాస్ కొడాలి అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద సంపాదించిన డాక్యుమెంట్ల ద్వారా ఈ షాకింగ్ వాస్తవం వెల్లడైంది.

ఒక పౌరుడు ఏయే నగరాలు తిరిగాడు, ఎన్ని ఉద్యోగాలు పొందాడు, ఎన్ని ఆస్తులు సంపాదించాడు.. ఎన్ని ఆస్తులు కోల్పోయాడు.. అలాగే ఒక వ్యక్తి కుటుంబంలో జనన, మరణాలు, వివాహం వంటి కుటుంబ సంబంధ వివరాలన్నీ ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి సమాచారం అందుతూనే ఉంటుంది. దేశంలోని ప్రతి ఒక్క ఇంటినీ జియో ట్యాగ్ చేసి.. దీన్ని ఇస్రో డెవలప్ చేసిన జియో స్పెషియల్ పోర్టల్ ‘భువన్’ తో అనుసంధానించే ప్రతిపాదన ఉందని 2019 అక్టోబర్ 4 న జరిగిన ఓ సమావేశంలో నీతి ఆయోగ్ స్పెషల్ సెక్రటరీ చెప్పినట్టు ఈ పత్రాల ద్వారా తెలిసింది. ఇందుకు గాను వచ్ఛే ఏడాదికల్లా ప్రత్యేకంగా సోషల్ రిజిస్ట్రీని అమలు చేయడానికి అనువుగా నిపుణుల కమిటీనొకదానిని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఈ కమిటీ తన పైలట్ ప్రాజెక్టుకు తుది మెరుగులు దిద్దుతోందట.  ఇది ఆధార్ చట్టానికి సవరణలు చేసే ప్రయత్నాల్లో ఉందని కూడా సమాచారం. 2018 లో ఆధార్ విషయంలో సుప్రీంకోర్టు ఇఛ్చిన తీర్పును ఏమాత్రం అతిక్రమించకుండా ఈ కమిటీ  ఈ చట్టాన్ని సవరించే సన్నాహాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎన్ పీ ఆర్ వంటి చట్టాలను కూడా మళ్ళీ అధ్యయనం చేస్తున్నారని వెల్లడైంది. ఆధార్ అన్నది ఒక వ్యక్తి ప్రైవసీకి సంబంధించిన హక్కు అని నాడు అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిక ప్రైవసీ అన్నది మొత్తం మోదీ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోవడానికి ఆట్టే కాలం లేనట్టే !

 

 

 

 

 

Click on your DTH Provider to Add TV9 Telugu