ఢిల్లీ ఎయిమ్స్ నుంచి కోవిడ్ రోగి పరారీ, కనిపించడం లేదంటున్న భర్త
కోవిడ్ సోకిన సుమారు ఇరవైఏళ్ళ యువతి ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి హఠాత్తుగా పరారైంది. ఎవరికీ చెప్పకుండా పారిపోయింది. ఈ విషయం ఆమె భర్తకు తెలిసినప్పటికీ,తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 18 న ఆమె ఆసుపత్రిలో చేరిందని, అయితే కామ్ గా అక్కడి నుంచి తన స్వగ్రామానికి వెళ్లిపోయిందని తెలిసింది. కోవిద్ పేషంట్ పారిపోవడం ఓ సంచలనం కాగా..ఈ విషయం తెలిసినా ఆమె భర్త ఆమె మిస్సయిందంటూ కంప్లయింట్ ఇవ్వడం […]
కోవిడ్ సోకిన సుమారు ఇరవైఏళ్ళ యువతి ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి హఠాత్తుగా పరారైంది. ఎవరికీ చెప్పకుండా పారిపోయింది. ఈ విషయం ఆమె భర్తకు తెలిసినప్పటికీ,తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 18 న ఆమె ఆసుపత్రిలో చేరిందని, అయితే కామ్ గా అక్కడి నుంచి తన స్వగ్రామానికి వెళ్లిపోయిందని తెలిసింది. కోవిద్ పేషంట్ పారిపోవడం ఓ సంచలనం కాగా..ఈ విషయం తెలిసినా ఆమె భర్త ఆమె మిస్సయిందంటూ కంప్లయింట్ ఇవ్వడం మరో సంచలనమైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరిపైనా వారు కేసు పెట్టారు.