కరోనా ఎఫెక్ట్: ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం.. కోట్ల మంది పేదరికం లోకి..

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కట్టడి కోసం ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది.

కరోనా ఎఫెక్ట్: ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం.. కోట్ల మంది పేదరికం లోకి..

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కట్టడి కోసం ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. కరోనా ప్రభావం వల్ల పెట్టుబడులు, ఉపాధి కల్పన, సృజనాత్మకత, విద్యారంగం, వాణిజ్యం, సరఫరా, వినియోగం వంటి అంశాలు బలహీనమయ్యాయని సంస్థ ఓ ప్రకటనలో వివరించింది. ఆధునిక కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పేదలపై తీవ్ర ప్రభావం చూపిందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్‌ మాల్పాస్‌ అన్నారు.

కాగా.. ఈ ఏడాది ఆరు కోట్ల మందికి పైగా ప్రజలు తీవ్ర పేదరికంలోకి వెళ్లిపోతారని ఆయన తెలిపారు. కాగా, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల ప్రభావంతో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని డేవిడ్‌ అభిప్రాయపడ్డారు. ఉత్పత్తికి అవసరమయ్యే మౌలిక వనరుల నిర్మాణం, వనరులు సమకూర్చటం వంటివి కోవిద్-19 అనంతరం ఎదురయ్యే సవాళ్లలో ముందుంటాయని తెలిపింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గత పదేళ్లలో అనేక సమస్యలతో సతమతమౌతున్నాయని అయన అభిప్రాయపడ్డారు.

మరోవైపు.. హెల్త్ కేర్ ఇండస్ట్రీ బలహీనంగా ఉన్న దేశాల్లోనే కాకుండా… మనుగడ కోసం అంతర్జాతీయ వాణిజ్యం, పర్యాటకం, ఎగుమతులపై ఆధారపడ్డ దేశాల్లో కూడా కరోనా ప్రభావం అధికమని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. కరోనా వ్యాప్తితో ఆ దేశాల్లో ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు చేపట్టే చర్యలకు విఘాతం కలుగుతోందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ఆర్థిక సంక్షోభం, మందగమనం వల్ల ఐదు సంవత్సరాల్లో ఆయా దేశాల్లో ఉత్పత్తి 8 శాతం వరకు పడిపోతుందని తెలిపింది.