ఉస్మానియా హాస్పిటల్‌లో.. డాక్టర్లపై.. కరోనా బాధితుల దాడి..

కోవిద్-19 విజృంభిస్తోంది. తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో కరోనా బాధితులు సహనం కోల్పోతున్నారు. మొన్నటికి మొన్న గాంధీ హాస్పిటల్‌లో కరోనా రోగులు వైద్యులపై దాడికి దిగితే,

ఉస్మానియా హాస్పిటల్‌లో.. డాక్టర్లపై.. కరోనా బాధితుల దాడి..

Edited By:

Updated on: Apr 14, 2020 | 4:47 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో కరోనా బాధితులు సహనం కోల్పోతున్నారు. మొన్నటికి మొన్న గాంధీ హాస్పిటల్‌లో కరోనా రోగులు వైద్యులపై దాడికి దిగితే, ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్‌లోనూ అదే సీన్‌ కనిపించింది. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో రెండు పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. అనుమానితులను, రోగులను ఒకే చోట ఉంచడంపై అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

ఐసోలేషన్‌ వార్డులో ఉన్న పీజీలపై కరోనా బాధితులు దాడి చేసినట్టు తెలుస్తోంది. కరోనా బాధితులు ఎవరూ సహనం కోల్పోకూడదని, అందరూ సంయమనం పాటించాలని పెద్దలు ఎంతగా చెప్పినా వినడం లేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఈ విషయం చెప్పారు. డాక్టర్లు దైవంతో సమానమని, వారిని ఇబ్బంది పెట్టవద్దని సీఎం చెప్పినా, ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి.

Also Read: కరోనా కట్టడికి ‘యాప్’తో నిఘా..!

Also Read: కరోనా కట్టడి కోసం.. ప్రపంచవ్యాప్తంగా 70 రకాల వ్యాక్సిన్ల తయారీ..