తల్లి పాలతో కరోనా సోకే అవకాశం తక్కువంట..!

|

Aug 10, 2020 | 11:23 AM

కరోనా ఉంటే, పాల ద్వారా పసిపిల్లలకు సోకుతుందన బెంగ ఎక్కువైంది. తల్లి పాలతో పిల్లలకు కరోనా సోకే అవకాశాలు తక్కువంటున్నారు నిపుణులు.

తల్లి పాలతో కరోనా సోకే అవకాశం తక్కువంట..!
Follow us on

ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. కరోనా తమకు సోకిందా.. లేదా అనే తెలియకుండానే బయట తిరిగేస్తున్నారు. వైరస్ ఏ రూపంలోనైనా అంటుకుంటుందన్న నిపుణుల హెచ్చరికలతో జనం హైరానా పడుతున్నారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో బిడ్డలకు జన్మనిచ్చిన తల్లులకు కొంత కంగారు మొదలైంది. తమకు కరోనా ఉంటే, పాల ద్వారా పసిపిల్లలకు సోకుతుందన బెంగ ఎక్కువైంది. తల్లి పాలతో పిల్లలకు కరోనా సోకే అవకాశాలు తక్కువంటున్నారు నిపుణులు. నిరభ్యంతరంగా కరోనా పేషెంట్లు తమ పిల్లలకు పాలు ఇవ్వవచ్చంటున్నారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయాన్నే చెప్పిందని గుర్తు చేస్తున్నారు.

కాకపోతే, కరోనా సోకిన తల్లులు పాలు ఇచ్చేటప్పుడు తల్లులు మాస్కులు, గ్లౌజులు ధరించడం తప్పనిసరి అని చెబుతున్నారు. ఎందుకంటే పాలద్వారా కరోనా వైరస్ వ్యాప్తి కాదు కానీ తల్లి శ్వాసద్వారా, దగ్గడం, తుమ్మడం లాంటివి.. బిడ్డను నేరుగా తాకినా తనకున్న ఆ కోవిడ్19 వైరస్ చిన్నారులకు సోకే అవకాశం ఉంది. కనుక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని నిరభ్యంతరంగా పాలు ఇవ్వవచ్చని నిపుణులు చెబుతున్నారు.

పాలు ఇవ్వలేని స్థితిలో ఉన్న తల్లులకు ఇతర తల్లుల నుంచి సేకరించిన పాలను అందిస్తామని హ్యూమన్ మిల్క్ బ్యాంకింగ్ అసోసియేషన్ భారత విభాగం అధ్యక్షుడు కేతన్ భరద్వాజ్ తెలిపారు. ఇలా సేకరించిన పాలను 62.5 డిగ్రీల సెల్సియస్‌ వద్ద వేడి చేసి తరువాత చల్లబరుస్తారు. శాస్త్రీయ పద్ధతుల్లో పాశ్చురైజేషన్‌ చేయడం వల్ల కరోనా వైరస్‌ నశిస్తుందంటున్నారు. బ్రెస్ట్ మిల్క్ బ్యాంకుల నుంచి తెప్పించి చిన్నారులకు పాలు పట్టవచ్చునని చెప్పారు. ఒకవేళ ఇతర మహిళ పాలను నేరుగా పట్టాల్సి వస్తే ఆ మహిళకు కరోనా నెగిటివ్‌ ఉంటే మంచిదని మరో నిపుణుడు అభిప్రాయపడ్డారు