బ్లాక్ మార్కెట్ లో.. కరోనా డ్రగ్..

| Edited By:

Jul 24, 2020 | 8:46 PM

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో కరోనా చికిత్సకు ఉపయోగించే ఇంజెక్షన్‌ను భారీ ధరకు విక్రయిస్తూ ఓ మహిళ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అధికారులకు

బ్లాక్ మార్కెట్ లో.. కరోనా డ్రగ్..
Follow us on

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో కరోనా చికిత్సకు ఉపయోగించే ఇంజెక్షన్‌ను భారీ ధరకు విక్రయిస్తూ ఓ మహిళ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. మహారాష్ట్రలోని థానే జిల్లా ఉల్లాస్‌నగర్‌లో ఈ ఘటన చేసుకున్నట్టు ఎఫ్‌డీఏ అధికారులు వెల్లడించారు. మార్కెట్‌లో టొసిలిజుమాబ్ ఆక్టెమ్రా ఇంజెక్షన్ ధర రూ.40,545 ఉండగా.. ఆమె దీన్ని రూ.60 వేలకు అమ్ముతున్నట్టు ఎఫ్‌డీఏకి సమాచారం అందిందని ఓ అధికారి వెల్లడించారు. దీంతో నిందితురాలు నీతా పంద్వానీ నివాసంపై గురువారం రాత్రి ఎఫ్‌డీఏ అధికారులు మెరుపుదాడి చేసినట్టు ఆయన తెలిపారు.

కాగా.. టొసిలిజుమాబ్ ఆక్టెమ్రా అనేది రోగనిరోధక వ్యవస్థ పనితీరును నియంత్రించే ఒక ఔషధం. కొవిడ్-19 వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి చికిత్స కోసం రెమిడెసివిర్‌తో కలిపి దీన్ని కూడా వినియోగిస్తున్నారు. కాగా.. ‘‘కనీసం ప్రిస్క్రిప్షన్ కూడా లేకుండా ఆమె ఇంజెక్షన్ విక్రయిస్తోంది. దీంతో ఆమెపై ఐపీసీ, డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ చట్టం, నిత్యావసర వస్తువుల చట్టం కింద కేసులు నమోదు చేశాం..’’ అని సదరు అధికారి పేర్కొన్నారు.

Also Read: హైదరాబాద్‌కు మరో ఘనత.. దేశంలోనే మొదటి స్థానం..