లాక్‌డౌన్ వేళ.. 54 రోజులుగా ఢిల్లీ విమానాశ్రయంలో..

| Edited By:

May 11, 2020 | 2:09 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. లాక్ డౌన్ కారణంగా విమాన సర్వీసులన్నీ నిలిపివేయడంతో

లాక్‌డౌన్ వేళ.. 54 రోజులుగా ఢిల్లీ విమానాశ్రయంలో..
Follow us on

German man living at Delhi airport: కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. లాక్ డౌన్ కారణంగా విమాన సర్వీసులన్నీ నిలిపివేయడంతో, న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఒకే ఒక్క ప్రయాణికుడు ఒంటరిగా మిగిలిపోయాడు. జర్మనీకి చెందిన ఎడ్గార్డ్ జీబాట్ అనే వ్యక్తి, మార్చి 18న హనోయి నుంచి ఇస్తాంబుల్ కు వెళుతూ, న్యూఢిల్లీలో చిక్కుబడిపోయి 54 రోజులుగా ఎయిర్ పోర్టును దాటి బయటకు రాలేకపోయాడు.

వివరాల్లోకెళితే.. ఢిల్లీ ఎయిర్ పోర్టులో చిక్కుబడిపోయిన విదేశీ ప్రయాణికులకు ఆయా దేశాల రాయబార కార్యాలయాలు అన్ని సౌకర్యాలనూ కల్పించగా, జీబాట్ కు జర్మనీలో నేర చరిత్ర ఉండటంతో, ఆ దేశ ఎంబసీ కల్పించుకోలేదు. అతన్ని క్వారంటైన్ కేంద్రానికి పంపించేందుకు కూడా జర్మనీ నిరాకరించింది. అతనికి ఉన్న నేర చరిత్ర కారణంగా ఇండియా వీసాను ఇచ్చేందుకు అధికారులు నిరాకరించడంతో, ఎయిర్ పోర్టును వదిలి అతను బయటకు రాలేకపోయాడు.

కాగా.. తన లగేజీతో విమానాశ్రయంలోనే కాలం గడుపుతూ కుటుంబీకులతో మాట్లాడుతూ, పత్రికలు చదువుతూ టైమ్ పాస్ చేస్తున్నాడు. ఓ రిలీఫ్ విమానంలో అతన్ని అంకారా చేర్చేందుకు అధికారులు ప్రయత్నించినా, టర్కీ అందుకు అంగీకరించలేదు. దీంతో ఇంటర్నేషనల్ సర్వీసులు తిరిగి ప్రారంభం అయ్యేంత వరకూ జీబాట్ ఎటూ కదల్లేని పరిస్థితి నెలకొంది.