Covid 19: కరోనా వైరస్ దెబ్బకు భారత్ మొత్తం లాక్ డౌన్ అయింది. అన్ని కంపెనీలు మూతపడ్డాయి. జనాలు ఇళ్లకు మాత్రమే పరిమితమయ్యారు. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోం చేస్తుండగా.. మరికొందరికి ఉపాధులు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇక పేదవాళ్ళ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లు రోజూ పనికి వెళ్తేనే ఇళ్లు గడుస్తుంది. అలాంటి వారికి కోసం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీలో ఇళ్లు అద్దెకు ఇచ్చిన యజమానులకు ఆయన ఓ విజ్ఞప్తి చేశారు. అద్దెకు ఉంటున్న వారిని ఓనర్లు రెంట్ కోసం వేధించవద్దు అని ఆయన కోరారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు ఇచ్చాయి. ఈ క్రమంలోనే యజమానులు ఇళ్లలో అద్దెకు ఉంటున్న వారి దగ్గర నుంచి బలవంతంగా అద్దె వసూలు చేయొద్దని సూచించారు. ఒకటి లేదా రెండు నెలల్లో ఇచ్చేస్తారని.. లేదా వాయిదాల రూపంలో వసూలు చేసుకుని పేదవారిని ఆదుకోవాలని కేజ్రివాల్ కోరారు. రాష్ట్రంలో ఎవరూ కూడా ఆకలితో బాధపడకుండా చూడాల్సిన బాద్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ వెల్లడించారు.
For More News:
కొత్తగూడెం పోలీస్ అధికారి, వంట మనిషికి కరోనా.. 39కి చేరిన కేసులు..
ఇండియా లాక్ డౌన్.. ఏ సేవలకు బ్రేక్.? ఏవి ఉంటాయి.?
‘ఇంటికి రావద్దు ప్లీజ్’.. కరోనా అనుమానితుల ఇళ్లకు రెడ్ నోటిసులు..
కరోనా మరణ మృదంగం.. ప్రపంచవ్యాప్తంగా 18 వేలు దాటిన మరణాలు..
దేశంలో మొట్టమొదటి కోవిడ్ 19 ఆసుపత్రి.. రిలయన్స్ సంచలనం..
కేటీఅర్ అన్నా.. మా ఊరికి పంపండి.. సోదరి విజ్ఞప్తి..
జక్కన్న అదిరిపోయే ఉగాది ట్రీట్.. ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ లోగో విడుదల..