చెత్త కుప్పలో రూ.14 లక్షలు పడేసిన జంట.. ఇంతలోనే అనుకోని ట్విస్ట్.?

| Edited By: Pardhasaradhi Peri

Jan 01, 2020 | 6:37 PM

డబ్బును ఎవరైనా చెత్త కుప్పలో పడేస్తారా.? ఇదేంటి పిచ్చి ప్రశ్న అని అనుకుంటున్నారా.? ఎవరైనా డబ్బును వీలయితే దాచుకుంటారు.. లేదా ఖర్చు పెట్టుకుంటారు గానీ పడేస్తారా అని మీ డౌట్. అయితే యూకేకు చెందిన ఓ జంట మాత్రం ఏకంగా రూ.14 లక్షలను చెత్తకుప్పలో పడేశారు. అదీ కూడా తెలిసి చేసిన పని కాదులెండి.. తెలియకుండా జరిగిపోయింది. అసలు ఆ మ్యాటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బర్మింగ్‌హమ్‌కు చెందిన ఓ జంట సమీప బంధువు అకాల మరణం చెందింది. […]

చెత్త కుప్పలో రూ.14 లక్షలు పడేసిన జంట.. ఇంతలోనే అనుకోని ట్విస్ట్.?
Follow us on

డబ్బును ఎవరైనా చెత్త కుప్పలో పడేస్తారా.? ఇదేంటి పిచ్చి ప్రశ్న అని అనుకుంటున్నారా.? ఎవరైనా డబ్బును వీలయితే దాచుకుంటారు.. లేదా ఖర్చు పెట్టుకుంటారు గానీ పడేస్తారా అని మీ డౌట్. అయితే యూకేకు చెందిన ఓ జంట మాత్రం ఏకంగా రూ.14 లక్షలను చెత్తకుప్పలో పడేశారు. అదీ కూడా తెలిసి చేసిన పని కాదులెండి.. తెలియకుండా జరిగిపోయింది. అసలు ఆ మ్యాటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

బర్మింగ్‌హమ్‌కు చెందిన ఓ జంట సమీప బంధువు అకాల మరణం చెందింది. దానితో ఆమె ఇంటిని వీరిద్దరూ శుభ్రం చేసి పనికిరాని చెత్తను, అక్కర్లేని వస్తువులను దగ్గరలోని డంపింగ్ యార్డుకు తీసుకెళ్లి పడేశారు. ఇక ఆ యార్డు సిబ్బంది చెత్తను వేరు చేసే క్రమంలో సంచుల్లో ఉన్న నోట్ల కట్టలను చూసి షాకయ్యారు. అంతేకాక ఎంతో నిజాయితీగా వాటిని పోలీసులకు అప్పజెప్పారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా డంపింగ్ యార్డుకు వచ్చిన ఆ జంట అడ్రెస్‌ను కనుగొన్నారు. ఇక వారి ఇంటికి వెళ్లిన పోలీసులు ఈ విషయంపై ప్రశ్నించగా.. తాము ఇంటిని శుభ్రం చేస్తుండగా వచ్చిన చెత్తను డబ్బు ఉన్న సంగతి తమకు తెలియదన్నారు. వారు చెప్పిందంతా విన్న పోలీసులు డబ్బును తిరిగి ఇచ్చేసి.. డంపింగ్ యార్డు సిబ్బంది చేసిన పనికి మెచ్చుకున్నారు.