కరోనా విలయతాండవం.. ప్రపంచ వ్యాప్తంగా ఒక కోటి ఐదు లక్షలకు చేరిన కేసులు..

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి భారత్ లో కూడా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్ కనుగొనే

కరోనా విలయతాండవం.. ప్రపంచ వ్యాప్తంగా ఒక కోటి ఐదు లక్షలకు చేరిన కేసులు..
Follow us

| Edited By:

Updated on: Jul 01, 2020 | 9:44 AM

Coronavirus: కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి భారత్ లో కూడా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్ కనుగొనే దిశగా తలమునకలై ఉన్నాయి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,05,86,381కి చేరాయి. అలాగే మొత్తం మరణాల సంఖ్య ఐదు లక్షలు దాటి.. 5,13,925కి చేరింది. ఇక ప్రస్తుతం 42,76,558 యాక్టీవ్ కేసులు ఉండగా, రికవరీ కేసుల సంఖ్య 57,95,898 గా ఉంది.

ఇక అమెరికా, బ్రెజిల్‌లో కరోనా వైరస్ జోరు ఎక్కువగా కనిపిస్తుంది. ఒక్కోసారి జోరు బాగా తగ్గినట్లు కనిపిస్తున్నా.. మరోసారి బాగా పెరుగుతున్నాయి. తాజాగా అమెరికాలో 14,54,397 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే బ్రెజిల్‌లో 5,58,789 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

Also Read: ఆదాయమే లక్ష్యంగా.. తెలంగాణలో మరో రెండు టోల్‌ప్లాజాలు..