ప్రపంచవ్యాప్తంగా 18 మిలియన్లు దాటిన కరోనా కేసులు..

|

Aug 03, 2020 | 8:56 PM

ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 18,301,179కి చేరుకుంది. అటు 694,008 మంది కరోనాతో చనిపోయారు. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు(4,821,575), మరణాలు(158,457) సంభవించాయి. ఇక బ్రెజిల్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 2,733,677కి చేరుకోగా..

ప్రపంచవ్యాప్తంగా 18 మిలియన్లు దాటిన కరోనా కేసులు..
Follow us on

Corona Cases In World: ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 218,149 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అత్యధికంగా 4421 మరణాలు సంభవించాయి. దేశాలన్నీ కూడా దశల వారీగా అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అయితే పెరుగుతున్న పాజిటివ్ కేసులతో పాటుగా రికవరీ కేసులు కూడా విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజలకు కాస్త ఊరటను ఇస్తోంది. ప్రస్తుతం ఉన్న గణాంకాలు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 11,508,536 మంది వైరస్ నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 18,301,179కి చేరుకుంది. అటు 694,008 మంది కరోనాతో చనిపోయారు.

అమెరికా, బ్రెజిల్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రతరంగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు(4,821,575), మరణాలు(158,457) సంభవించాయి. ఇక బ్రెజిల్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 2,733,677కి చేరుకోగా.. 94 వేలకు పైగా మరణాలు సంభవించాయి. అటు రష్యాలో కూడా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కాగా, భారత్‌లో కరోనా కేసులు 1,830,949 నమోదు కాగా, మృతుల సంఖ్య 38,485కి చేరింది.