దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు..

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 62,538 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 886 మరణాలు సంభవించాయి.

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు..

Coronavirus Positive Cases India: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 62,538 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 886 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,27,075కి చేరుకుంది. ఇందులో 6,07,384 యాక్టివ్ కేసులు ఉండగా.. 41,585 మంది కరోనాతో మరణించారు. అటు 13,78,106 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో వరుసగా తొమ్మిదో రోజు 50,000 పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. తాజాగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 38 శాతం ఏపీ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల నుంచే ఉన్నాయి. ఇక అన్ని రాష్ట్రాల్లోనూ రికవరీ కేసులు ఎక్కువగా ఉండటం కాస్త ఊరటను ఇచ్చే అంశం అని చెప్పాలి. అటు కోవిడ్ మరణాలు ఎక్కువగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో సంభవించాయి. కాగా, దేశంలో ప్రస్తుతం రికవరీ రేట్ 67.98 శాతంలో ఉండగా.. డెత్ రేట్ 2.05 శాతంలో ఉంది.

Also Read:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పల్లెల్లోనూ మాస్క్ తప్పనిసరి.. లేదంటే జరిమానా!

కోవిడ్ ఇన్ఫెక్షన్లు ఆరు రకాలు.. ఆ లక్షణాలు ఉంటే జాగ్రత్త.!

జగన్ కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి కాలేజీలు ఓపెన్..

Click on your DTH Provider to Add TV9 Telugu