కరోనా మృత్యుకేళి.. ఒక్క రోజులో 78,512 కేసులు, 971 మరణాలు..

|

Aug 31, 2020 | 11:31 AM

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 78,512 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 971 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 36,21,245కి చేరుకుంది.

కరోనా మృత్యుకేళి.. ఒక్క రోజులో 78,512 కేసులు, 971 మరణాలు..
Follow us on

Coronavirus Positive Cases India: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 78,512 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 971 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 36,21,245కి చేరుకుంది.

ఇందులో 7,81,975 యాక్టివ్ కేసులు ఉండగా.. 64,469 మంది కరోనాతో మరణించారు. అటు దేశంలో ఇప్పటివరకు 27,74,801 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. ఇక అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాల లిస్టులో మహారాష్ట్ర, న్యూఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. నిన్న ఒక్క రోజే దేశంలో 60868 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా, దేశంలో ప్రస్తుతం రికవరీ రేట్ 76.63 శాతం ఉండగా.. మరణాల రేటు 1.78 శాతంగా ఉంది.

Also Read: 

‘వైఎస్సార్ బీమా’ పధకం విధి విధానాలు.. జిల్లాల వారీగా ఫోన్ నెంబర్లు.!

ఏపీ: 1036 గ్రామ, వార్డు వాలంటీర్ల పోస్టులు.. వెంటనే దరఖాస్తు చేసుకోండిలా.!

”టాలీవుడ్‌లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవు”..

IPL 2020: ఒకే టీంలో కోహ్లీ, డివిలియర్స్, స్మిత్‌లు.. ఎప్పుడంటే..

సంచలన నిర్ణయం దిశగా జగన్ సర్కార్.. ఆన్‌లైన్‌ రమ్మీపై నిషేధం.!