Coronavirus Positive Cases In Andhra Pradesh: ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు సంఖ్య రికార్డుస్థాయిలో నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో 61,699 శాంపిల్స్ పరీక్షించగా.. 10,376 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రంలో ఇప్పటివరకు 1,40,933 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 75,720 యాక్టివ్ కేసులు ఉండగా.. 63,864 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు ఇప్పటివరకు 1349 మంది వైరస్ కారణంగా మరణించారు.
ఇక గడిచిన 24 గంటల్లో 3,822 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. 68 మంది మహమ్మారి బారినపడి చనిపోయారు. జిల్లాల వారీగా చూసుకుంటే.. అనంతపురంలో అత్యధికంగా 1,387 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరిలో 1,215, కర్నూలులో 1,124 కేసులు వెలుగు చూశాయి. ఆ తర్వాత చిత్తూరులో 789, గుంటూరులో 906, కడపలో 646, కృష్ణలో 313, నెల్లూరులో 861, ప్రకాశంలో 406, శ్రీకాకుళంలో 402, విశాఖపట్నంలో 983, విజయనగరంలో 388, పశ్చిమ గోదావరిలో 956 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది.
Also Read:
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారం రోజుల్లో పర్యాటకులకు అనుమతి
ఆగష్టు 31 వరకు అంతర్జాతీయ విమానాలు రద్దు.
ఆగష్టు 15 ఏపీ రాజధాని తరలింపు.. పంద్రాగస్టు వేడుకలు అక్కడే…
ఏపీలో కరోనా డేంజర్ బెల్స్.. ఆ నాలుగు జిల్లాలు హైరిస్క్!
#COVIDUpdates: 31/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1,38,038 పాజిటివ్ కేసు లకు గాను
*60,969 మంది డిశ్చార్జ్ కాగా
*1,349 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 75,720#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/XzKz2fb2c6— ArogyaAndhra (@ArogyaAndhra) July 31, 2020