ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారంలో పర్యాటకులకు అనుమతి!

కరోనా కారణంగా దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని తిరిగి అభివృద్ధి చేసే దిశగా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే అన్ని జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాలను అందుబాటులోకి తీసుకురానుంది.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారంలో పర్యాటకులకు అనుమతి!
Follow us

|

Updated on: Jul 31, 2020 | 4:50 PM

AP Tourist Places: కరోనా కారణంగా దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని తిరిగి అభివృద్ధి చేసే దిశగా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే అన్ని జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాలను అందుబాటులోకి తీసుకురానుంది. వారం రోజుల్లోగా పర్యాటకులకు అనుమతిస్తామని టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. టూరిజం హోటళ్లను కూడా తెరుస్తామని.. ఆగష్టు 15వ తేదీ నుంచి అన్ని చోట్ల నుంచి బోట్లు తిరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. టెంపుల్ టూరిజాన్ని కూడా మరింతగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అటు వారంలోగా టూరిస్ట్ బస్సులను కూడా సిద్దం చేస్తామన్నారు.

ఇక కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుగుణంగా త్వరలోనే రాష్ట్రంలో జిమ్‌లను సైతం ప్రారంభిస్తామన్నారు. కాగా, త్వరలోనే నాలుగు క్రీడా వికాస కేంద్రాలను ప్రారంభిస్తామన్న మంత్రి.. ప్రతిభ కలిగిన పేద పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా గతేడాది రూ. 3 కోట్లు పేద క్రీడాకారులకు అందించామని.. ఇక ఈ ఏడాది కూడా మరో రూ. 3 కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు.

Also Read:

మహిళల కోసం మరో రెండు పధకాలు.. జగన్ సర్కార్ సంచలనం

హైదరాబాద్‌లో కరోనా పరీక్షల కేంద్రాల వివరాలివే.!

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆగష్టు 15 నుంచి వీడియో పాఠాలు!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ప్లాస్టిక్ పూర్తిగా బ్యాన్.!