కరోనాకి విరుగుడు.. ఆ ఆయుర్వేద మూలికపై.. క్లినికల్ ట్రయల్స్ షురూ..!

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. దీని కట్టడికోసం లాక్ డౌన్ పొడిగించిన విషయం విదితమే. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి.

కరోనాకి విరుగుడు.. ఆ ఆయుర్వేద మూలికపై.. క్లినికల్ ట్రయల్స్ షురూ..!
Follow us

| Edited By:

Updated on: May 08, 2020 | 11:20 AM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. దీని కట్టడికోసం లాక్ డౌన్ పొడిగించిన విషయం విదితమే. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. మన దేశంలో కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయుర్వేద మూలిక అశ్వగంధపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు భారత్ సిద్ధమవుతోంది.

కాగా.. మలేరియాను వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ తో పోలిస్తే ఇది ఏమేరకు సమర్థవంతంగా పని చేస్తుందో తెలుసుకోనుంది. ఐసీఎంఆర్, సీఎస్ఐఆర్ సాంకేతిక సిబ్బంది సాయంతో ఆయుష్, వైద్య, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖలు ఉమ్మడిగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.

మరోవైపు.. కరోనా కట్టడి కోసం భారత్ శత విధాల ప్రయత్నిస్తోంది. ఆయుష్ కార్యదర్శి రాజేశ్ కొటెచా మాట్లాడుతూ, కరోనా లక్షణాలు స్వల్పంగా, కాస్త ఎక్కువగా ఉన్న రోగులకు అశ్వగంధతో పాటు యష్టిమధు, గుడూచి, పిప్పలి, పాలా హెర్బల్ ఫార్మలేషన్ (ఆయుష్64) ఇస్తారని చెప్పారు. ఊపిరితిత్తులు, శ్వాస సమస్యలు రాకుండా… వస్తే వాటిని నివారించేందుకు ఈ క్లినికల్ ట్రయల్స్ ఉపయోగపడతాయని తెలిపారు. ఆయుష్64ని మలేరియా నివారణకు వాడతారు.