ఏపీలో కరోనా విజృంభణ.. జూలై 31 వరకు నెల్లూరులో లాక్‌డౌన్‌..!

|

Jul 23, 2020 | 5:15 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా నెల్లూరులో రేపటి నుంచి లాక్‌డౌన్‌ విధించాలని జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.

ఏపీలో కరోనా విజృంభణ.. జూలై 31 వరకు నెల్లూరులో లాక్‌డౌన్‌..!
Follow us on

Coronavirus In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని పలు నగరాలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ విధించుకుంటున్నాయి. తాజాగా నెల్లూరులో కూడా రేపటి నుంచి లాక్‌డౌన్‌ విధించాలని జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులో ఉంటాయని ఆయన అన్నారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే నిత్యావసర దుకాణాలు తెరిచి ఉంటాయన్నారు. అలాగే లాక్‌డౌన్‌ సమయంలో మెడికల్ సర్వీసులకు, ఫుడ్ డోర్ డెలివరీలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. కాగా, నెల్లూరులో జిల్లాలో ఇప్పటివరకు 3 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో 1400 పైచిలుక కేసులు నెల్లూరు నగరంలోనే నమోదయ్యాయి. దీనితో ఇప్పటికే జిల్లాలోని పలు మున్సిపాలిటీలు, మేజర్ గ్రామ పంచాయితీలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి.

Also Read:

జగన్ సర్కార్ మరో సంచలనం.. ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ కాలేజీల్లో ఐఐటీ, జేఈఈలకు శిక్షణ..

Part 3: ”సుశాంత్‌ది హత్యేనా” ఆత్మ ఏం చెప్పింది.? షాకింగ్ వాస్తవాలు…