కరోనా దెబ్బకు కుదేలైన టూరిజం

|

Jan 30, 2020 | 6:07 PM

చైనా టూరిజంపై కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. బుక్ చేసుకున్న ప్రయాణికులు భయపడి క్యాన్సిల్ చేసుకుంటుండటంతో ట్రావెల్ ఏజెన్సీల వ్యాపారం ఒక్కసారిగా పడిపోయింది. హైదరాబాద్ నుంచి చైనాకు వెళుతున్న టూరిస్టుల్లో ఏర్పడిన కరోనా వైరస్ భయంతో ఒక్కో ట్రావెల్ సంస్థ కు 15 నుంచి 40 లక్షల వ్యాపార నష్టాలు వస్తున్నాయంటున్నాయి ఏజన్సీలు. కరోనా దెబ్బకు కంగుతిన్న ట్రావెల్ వ్యాపారానికి సంబంధించిన అంశాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. కారోనా వైరస్… చైనా టూరిజానికి షాక్ ఇచ్చింది. ఇండియా నుంచి చైనాకు […]

కరోనా దెబ్బకు కుదేలైన టూరిజం
Follow us on

చైనా టూరిజంపై కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. బుక్ చేసుకున్న ప్రయాణికులు భయపడి క్యాన్సిల్ చేసుకుంటుండటంతో ట్రావెల్ ఏజెన్సీల వ్యాపారం ఒక్కసారిగా పడిపోయింది. హైదరాబాద్ నుంచి చైనాకు వెళుతున్న టూరిస్టుల్లో ఏర్పడిన కరోనా వైరస్ భయంతో ఒక్కో ట్రావెల్ సంస్థ కు 15 నుంచి 40 లక్షల వ్యాపార నష్టాలు వస్తున్నాయంటున్నాయి ఏజన్సీలు. కరోనా దెబ్బకు కంగుతిన్న ట్రావెల్ వ్యాపారానికి సంబంధించిన అంశాలు ఆశ్చర్యపరుస్తున్నాయి.

కారోనా వైరస్… చైనా టూరిజానికి షాక్ ఇచ్చింది. ఇండియా నుంచి చైనాకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గడంతో, ట్రావెల్స్ ఏజెన్సీ వ్యాపారులు ఆందోళనలో పడిపోయారు. నెల ముందే చైనా, హాంకాంగ్ దేశాలకు టికెట్స్ బుక్ చేసుకున్న పాసెంజర్లు క్యాన్సిల్ చేసుకోవడంతో 15 నుంచి 40 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ట్రావెల్ ఏజెన్సీల యజమానులు అంటున్నారు. హైదరాబాద్‌లో 100కు పైగా ట్రావెల్స్, చైనా టూరిజానికి సేవలు అందిస్తున్న నేపథ్యంలో.. టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఒకవేళ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే తిరిగి డబ్బులు చెల్లిస్తాం అంటున్నారు వ్యాపారులు.

నెల రోజుల అడ్వాన్స్‌లో చైనా, హాంకాంగ్ దేశాలకు టూరిస్టులుగా వెళ్ళాలని టిక్కెట్స్ బుక్ చేసుకున్న వారు.. ఇప్పడు ఆ ప్రయాణాలకు ఆఫ్రికా, యూరప్ దేశాలకు మార్చుకుంటున్నారు. వైరస్ గురించి ముందే తెలియడంతో తమ పర్యటనలకు మార్చుకుంటున్నామని, తెలియకుండా వెళ్ళి వుంటే.. రాకాసి వైరస్ బారిన పడి మృత్యువుకు చేరువయ్యేవారిమని పలువురు చెబుతున్నారు.

యాడ్స్ అండ్ ప్రింటర్స్ ముడి సరుకుల కోసం చైనాకు తరచూ వెళ్ళే వారు హైదరాబాద్‌లో చాలా మంది వున్నారు. వారంతా అటు ముడి సరుకు దొరికే వేరే చోటు దొరక్క, ఇటు చైనా వెళ్ళలేక మధనపడుతున్నారు. ముడి సరుకుల కొరతతో వ్యాపారం దెబ్బ తింటుందని పలువురు అంటున్నారు.

సదరన్ ట్రావెల్స్‌కు సంబంధించి మొత్తం 11 బ్రాంచులు హైదరాబాద్‌లో ఉండగా.. అన్ని చోట్ల నుంచి కలిపి 100 నుంచి 150 వరకు సదరన్ ట్రావెల్స్‌తో టైఅప్‌లో ఉన్నాయి. ప్రతీ సంవత్సరం 30 నుంచి 40 మంది చైనా, హాంకాంగ్ లాంటి దేశాలకు వెళ్తుంటారు. ట్రావెల్స్ నుంచి చైనా, హాంకాంగ్ దేశాలకు బుక్ చేసుకున్న వాళ్ళు, ఇంకో ప్లేస్ కి వెళ్లాడమో.. లేదా డబ్బు తిరిగి ఇమ్మని అడగడమో చేస్తున్నారని, దాంతో 30 నుంచి 40 లక్షలు వరకు నష్టం వచ్చిందని ట్రావెల్స్ ప్రతినిధులు చెబుతున్నారు.