Coronavirus: కొత్తగూడెం పోలీస్ అధికారి, వంట మనిషికి కరోనా.. 39కి చేరిన కేసులు..

|

Mar 25, 2020 | 1:51 PM

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. మంగళవారం ఒక్కరోజే ఆరుగురికి వైరస్ సోకినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో విదేశాల నుంచి వచ్చిన వారు ముగ్గురు ఉండగా.. లోకల్ కాంటాక్ట్ ద్వారా మరో ముగ్గురు ఈ మహమ్మారి బారిన పడినట్లు తెలిపింది. దీనితో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39కి చేరింది...

Coronavirus: కొత్తగూడెం పోలీస్ అధికారి, వంట మనిషికి కరోనా.. 39కి చేరిన కేసులు..
Follow us on

Coronavirus: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. మంగళవారం ఒక్కరోజే ఆరుగురికి వైరస్ సోకినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో విదేశాల నుంచి వచ్చిన వారు ముగ్గురు ఉండగా.. లోకల్ కాంటాక్ట్ ద్వారా మరో ముగ్గురు ఈ మహమ్మారి బారిన పడినట్లు తెలిపింది. దీనితో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39కి చేరింది. ఇక లోకల్‌ కాంటాక్ట్‌ ద్వారా మంగళవారం కరోనా వైరస్‌ సోకిన వారిలో కొత్తగూడెం డీఎస్పీ (57), ఆయన ఇంట్లో పని మనిషి(33)కి కూడా వైరస్ సోకినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

దీనితో రాష్ట్రంలో లోకల్ కాంటాక్ట్ ద్వారా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. అటు ఇప్పటికే రాష్ట్రంలో కరోనా వైరస్ రెండో దశకు చేరుకోవడంతో.. ఇదే తీవ్రతరం కొనసాగితే మూడో స్టేజికి వెళ్ళే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇక రాష్ట్రం లాక్ డౌన్ కాగా.. నిన్న రాత్రి నుంచి కర్ఫ్యూ అమలులోకి వచ్చింది.

విదేశాల నుంచి వచ్చిన కరోనా పాజిటివ్ కేసులు..

  • కోకాపేట్‌కు చెందిన 49 ఏళ్ల వ్యక్తి. ఇటీవల లండన్ నుంచి వచ్చాడు.
  • చందానగర్‌కు చెందిన 39 ఏళ్ల మహిళ. ఈమె జర్మనీ నుంచి వచ్చింది.
  • బేగంపేట్‌కు చెందిన 61 ఏళ్ల మహిళ. ఇటీవల సౌది అరేబియా నుంచి వచ్చింది.

For More News:

ఏపీలో మరో కరోనా కేసు…

ఇండియా లాక్ డౌన్.. ఏ సేవలకు బ్రేక్.? ఏవి ఉంటాయి.?

‘ఇంటికి రావద్దు ప్లీజ్’.. కరోనా అనుమానితుల ఇళ్లకు రెడ్ నోటిసులు..

కరోనా మరణ మృదంగం.. ప్రపంచవ్యాప్తంగా 18 వేలు దాటిన మరణాలు..

దేశంలో మొట్టమొదటి కోవిడ్ 19 ఆసుపత్రి.. రిలయన్స్ సంచలనం..

కేటీఅర్ అన్నా.. మా ఊరికి పంపండి.. సోదరి విజ్ఞప్తి..

జక్కన్న అదిరిపోయే ఉగాది ట్రీట్.. ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ లోగో విడుదల..

ఈ లక్షణాలు ఉన్నా.. కరోనా వైరస్ సోకినట్లే..!

గుడ్ న్యూస్.. కరోనాలా హంటా వైరస్ కాదట… అసలు నిజమిదే.!