దేశంలో కరోనా విలయం.. ఒక్క రోజే 9,996 కేసులు, 357 మరణాలు..

దేశంలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతూనే ఉంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరోసారి అత్యధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దేశంలో కరోనా విలయం.. ఒక్క రోజే 9,996 కేసులు, 357 మరణాలు..

Updated on: Jun 11, 2020 | 11:19 AM

దేశంలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతూనే ఉంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరోసారి అత్యధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా 9,996 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా బులిటెన్ విడుదల చేసింది. దీనితో మొత్తంగా కేసుల సంఖ్య 2,86,579కి చేరగా.. ఇందులో యాక్టివ్ కేసులు 137448 ఉన్నాయి. అటు 1,41,028 మంది కరోనాను జయించి ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో 357 మంది మహమ్మారి బారిన పడి మరణించడంతో.. మొత్తం మృతుల సంఖ్య 8102కి చేరింది.

ఎక్కువ కరోనా కేసులు ఉన్న రాష్ట్రాలు ఇవే…

  • మహారాష్ట్ర – 94041
  • తమిళనాడు – 36841
  • ఢిల్లీ – 32810
  • గుజరాత్ – 21521
  • ఉత్తరప్రదేశ్ – 11610
  • రాజస్తాన్ – 11600
  • మధ్యప్రదేశ్ – 10049
  • వెస్ట్ బెంగాల్ – 9328
  • కర్ణాటక – 6041

ఎక్కువ మరణాలు సంభవించిన రాష్ట్రాలు..

  • మహారాష్ట్ర – 3438
  • గుజరాత్ – 134
  • ఢిల్లీ – 984
  • వెస్ట్ బెంగాల్ – 432
  • మధ్యప్రదేశ్ – 427
  • తమిళనాడు – 326
  • ఉత్తరప్రదేశ్ – 321
  • రాజస్తాన్ – 259
  • కర్ణాటక – 69