
Coronavirus Cases India: దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 29,164 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 88,74,291కి చేరింది. చేరింది. వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 4,53,401 మంది చికిత్స పొందుతుండగా.. ఇప్పటివరకు 82,90,371 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న దేశవ్యాప్తంగా 449 మంది మృతి చెండంతో మొత్తం ఇప్పటివరకు వైరస్ కారణంగా 1,30,591 మంది ప్రాణాలు కోల్పోయారు.
అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. పాజిటివ్ కేసుల కంటే రికవరీ రేటు అధికంగా ఉంటోందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 40,791 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది. అటు నిన్న 8,44,382 టెస్టులు చేయగా.. మొత్తం దేశవ్యాప్తంగా టెస్టుల సంఖ్య 12.65 కోట్లకు చేరింది. దేశంలో సుమారు 93.42 శాతానికి రికవరీ రేటు చేరిందంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 5.11 శాతానికి తగ్గాయి. మరణాలు రేటు 1.47 శాతానికి తగ్గింది.
COVID-19 Testing Update. For more details visit: https://t.co/dI1pqvXAsZ @MoHFW_INDIA @DeptHealthRes #ICMRFIGHTSCOVID19 #IndiaFightsCOVID19 #CoronaUpdatesInIndia #COVID19 pic.twitter.com/aS3WH6m6rh
— ICMR (@ICMRDELHI) November 17, 2020