నేడు ఒంటిమిట్ట‌లో నిరాండ‌బ‌రంగా రాములోరి క‌ళ్యాణం..

|

Apr 07, 2020 | 2:57 PM

శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఇవాళ సీతారాముల కల్యాణం జరగనుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తులెవరూ రావద్దని ఇప్పటికే టీటీడీ అధికారులు కూడా విజ్ఞప్తి చేశారు. సీతారాముల వివాహ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే అవకాశం కల్పించారు. భక్తుల తమ ఇండ్ల నుంచే స్వామి […]

నేడు ఒంటిమిట్ట‌లో నిరాండ‌బ‌రంగా రాములోరి క‌ళ్యాణం..
Follow us on

శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఇవాళ సీతారాముల కల్యాణం జరగనుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తులెవరూ రావద్దని ఇప్పటికే టీటీడీ అధికారులు కూడా విజ్ఞప్తి చేశారు. సీతారాముల వివాహ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే అవకాశం కల్పించారు. భక్తుల తమ ఇండ్ల నుంచే స్వామి వారి కల్యాణాన్ని చూడొచ్చని ఆలయ అధికారులు తెలిపారు. సీతారాముల కల్యాణ మహోత్సవ ఘట్టాన్ని ఆగమశాస్త్ర ప్రకారం ఆలయంలోని గర్భగుడి వెనుక భాగంలో ఉన్న కల్యాణమండలంలో నిర్వహించనున్నారు.