Breaking : కరోనా టెస్టుల ధరలను తగ్గిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు..తాజా ధరల పూర్తి వివరాలు ఇవే

|

Dec 15, 2020 | 7:28 PM

కరోనా నిర్ధారణ పరీక్షల ధరలను తగ్గిస్తూ.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నమెంట్ పంపే సాంపిల్స్ టెస్టింగ్ ధరలను రూ.800 నుంచి 475 రూపాయలకు తగ్గించారు.

Breaking :  కరోనా టెస్టుల ధరలను తగ్గిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు..తాజా ధరల పూర్తి వివరాలు ఇవే
Corona-Tests
Follow us on

కరోనా నిర్ధారణ పరీక్షల ధరలను తగ్గిస్తూ.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నమెంట్ పంపే సాంపిల్స్ టెస్టింగ్ ధరలను రూ.800 నుంచి 475 రూపాయలకు తగ్గించారు. ఎన్ఏబీఎల్ ల్యాబుల్లో చేసే కోవిడ్ టెస్టింగ్ ధరలను రూ.1000 నుంచి 499 రూపాయలకు తగ్గించారు. కరోనా టెస్ట్ కిట్ల తయారీ ఎక్కువగా ఉండడంతో మార్కెట్లో వాటి ధరలు తగ్గాయని.. అందువల్లే కరోనా పరీక్షల ధరలు తగ్గించినట్లు ఆదేశాల్లో ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తగ్గించిన ధరలను అమలు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

మరోవైపు ఉభయ తెలుగు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిన విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తి తగ్గినప్పటికీ జాగ్రత్తల విషయంలో రాజీ పడొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు. చలి తీవ్రత పెరుగుతోన్న నేపథ్యంలో మరింత అప్రమత్తత అవసరమన్నారు. ఇక ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 61,452 సాంపిల్స్ టెస్ట్ చేయగా, 500 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 876336 కు చేరింది.

 

Also Read :