ఏపీకిది గుడ్‌న్యూస్? పాజిటివ్ నెంబర్‌కు చేరువలో రికవరీలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. రోజురోజుకూ 10 వేలు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే అదే సమయంలో రికవరీ కేసుల శాతం కూడా గణనీయంగా పెరుగుతోంది.

ఏపీకిది గుడ్‌న్యూస్? పాజిటివ్ నెంబర్‌కు చేరువలో రికవరీలు

Updated on: Sep 09, 2020 | 7:01 PM

Corona Cases Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. రోజురోజుకూ 10 వేలు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే అదే సమయంలో రికవరీ కేసుల శాతం కూడా గణనీయంగా పెరుగుతోంది. గత మూడు రోజుల్లో 31,588‬ మంది కరోనాను జయించి ఆరోగ్యవంతులుగా ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,418 పాజిటివ్ కేసులు, 75 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,27,512కి చేరింది. ఇందులో 97,271 యాక్టివ్ కేసులు ఉండగా.. 4,25,607 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో మృతుల సంఖ్య 4634కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 9,842 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా.. అత్యధికంగా మూడు జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరిలో 1399, ప్రకాశం 1271, పశ్చిమ గోదావరిలో 1134 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

కాగా, ఒకపక్క రాష్ట్రంలో టెస్టులు పెంచే కొద్దీ పాజిటివ్ కేసులు బయటపడుతుంటే.. అటు రికవరీ కేసుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 4,25,607 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గత మూడు రోజుల్లో సుమారుగా 30 వేల పైచిలుకు మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.

గత వారం రోజులుగా రికవరీ కేసుల సంఖ్య ఇలా…

09-09-2020:  9,842

08-09-2020: 11,691

07-09-2020: 10,055

06-09-2020: 11,915

05-09-2020: 11,941

04-09-2020: 12,334

03-09-2020: 9,499