మహానగరాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో కరోనా క్రమంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు జిల్లా కేంద్రాల్లోకి కొవిడ్ కేసులు నమోదవుతుండటంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. శ్రావణ మాసం పెళ్లిళ్ల మాసం అంటారు. శ్రావణం మొదలైందంటే పెళ్ళిళ్ల సందడి షురు అవుతుంది. రాష్ట్రంలో ఏటా 10 లక్షల పెళ్ళ్లిలు జరిగితే ఈ ఒక్క నెలలోనే 3 లక్షల నుంచి 4 లక్షల పెళ్ళిలు జరుగుతాయి.
అయితే కరోనా కారణంగా పండగలు శుభకార్యాలన్నీ కళ తప్పిపోయాయి. ఏదైనా పండగ వస్తే.. ఉండే సందడి కరోనా భయంతో అదికాస్త కనిపిండంలేదు. అంతేకాదు పెళ్లిళ్లు చేసుకునేవారికి సైతం కరోనా భయం వెంటాడుతోంది. అంతా సెట్ అయిపొయింది ఈ ఏడాది పెళ్లి చేసుకుందాం అని అనుకున్న వారి ప్లాన్స్ అన్నీ కరోనా కారణంగా వాయిదా పడుతున్నాయి. చాలా మంది పెళ్లి అంటే జీవితానికి ఒక్కసారే కాబట్టి ఈ కరోనా హడావుడి తరువాత చేసుకుందామని అనుకుంటుంటే ఇంకొందరు మాత్రం తక్కువ మందితో కానిచ్చేద్దామని చేసేసుకుంటున్నారు.
అయితే ఇలా తక్కువ మందితో కానిచ్చేద్దామని అనుకున్నవారిని కూడా కరోనా రక్కసి వదలడం లేదు. తాజాగా ఓ పెళ్లికి వెళ్లిన 16 మందికి కరోనా సోకింది. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో 26 మందికి పరీక్షలు నిర్వహించగా 18 మందికి వైరస్ నిర్ధరణ అయ్యింది. వైరస్ సోకిన వారిలో 16 మంది పట్టణంలోని ఒకే వీధికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. ఇటీవల వీరంతా ఓ వివాహ వేడుకలో పాల్గొన్నట్లు సమాచారం.
వారం క్రితం ధర్మపురికి చెందిన అమ్మాయికి, మంచిర్యాలకు చెందిన అబ్బాయితో ధర్మపురిలోనే వివాహం జరిగింది. పెళ్లి కాస్త ఘనంగా జరగడంతో ఆ తర్వాత .. వివాహానికి హాజరైన అతిథులకు కరోనా వెంటాడింది. కరోనా కేసుల సంఖ్య పెరగడంతో ధర్మపురి పట్టణంలోని పలు కాలనీల్లో మున్సిపల్ సిబ్బంది రసాయనాలు పిచికారీ చేశారు.