Corona India: దూసుకెళ్తున్న రికవరీ రేటు.. కరోనా కట్టడిలో ఆ రాష్ట్రాలే ఆదర్శం..
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 10 లక్షల మందిలో కేవలం 657 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదవుతున్నట్లు పేర్కొంది.

Corona India: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 10 లక్షల మందిలో కేవలం 657 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదవుతున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు కరోనా నుంచి 5.7 లక్షల మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ఇదిలా ఉంటే సుమారు 10 రాష్ట్రాల్లో 86 శాతం పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయంది.
వాటిల్లో మహారాష్ట్ర, తమిళనాడు నుంచి 50 శాతం.. అలాగే కర్ణాటక, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, గుజరాత్, అస్సాం రాష్ట్రాల నుంచి 36 శాతం కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక కరోనా రికవరీ రేటులో జాతీయ స్థాయి సగటు కంటే 20 రాష్ట్రాలు ముందున్నాయని కేంద్రం తెలిపింది. జాతీయ రికవరీ రేటు 63.02% ఉండగా.. లడఖ్(85.45), ఛతీస్‌గఢ్(77.68), ఢిల్లీ(79.98), ఉత్తరాఖండ్(78.77), హిమాచల్ ప్రదేశ్(76.59), హర్యానా(75.25), చండీగఢ్(74.59), రాజస్తాన్(74.22), మధ్యప్రదేశ్(73.03), గుజరాత్(69.73), త్రిపుర(69.18), బీహార్(69.09), పంజాబ్(68.94), ఒడిశా(66.69), మిజోరం(64.84), తమిళనాడు(64.66), ఉత్తరప్రదేశ్(63.97) రాష్ట్రాల్లో రికవరీ రేటు ఎక్కువగా ఉంది.
86% of the total cases are confined to 10 states. Two of these have 50% of these cases – Maharashtra and Tamil Nadu – and eight other states have 36% cases: Rajesh Bhushan, OSD, Ministry of Health. #COVID19 pic.twitter.com/gsKALU15SB
— ANI (@ANI) July 14, 2020
Of these states Uttar Pradesh has a recovery rate of 64%, Odisha 67%, Assam 65%, Gujarat 70%, Tamil Nadu has a recovery rate of 65%: Rajesh Bhushan, OSD, Ministry of Health. #COVID19 https://t.co/rpsbpX2MnK
— ANI (@ANI) July 14, 2020