Corona Death Toll: కరోనా మరణ మృదంగం.. ప్రపంచవ్యాప్తంగా 18 వేలు దాటిన మరణాలు..

|

Mar 25, 2020 | 1:50 PM

యావత్ మానవజాతిని కరోనా వైరస్ మహమ్మారి భయబ్రాంతులకు గురి చేస్తోంది. ప్రపంచదేశాలను వణికిస్తున్న ఈ కోవిడ్ 19 కారణంగా రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 422,743 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 18,902 మంది మృత్యువాత పడ్డారు. ఇక 109,102 మంది ఈ మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు...

Corona Death Toll: కరోనా మరణ మృదంగం.. ప్రపంచవ్యాప్తంగా 18 వేలు దాటిన మరణాలు..
Follow us on

Corona Death Toll: యావత్ మానవజాతిని కరోనా వైరస్ మహమ్మారి భయబ్రాంతులకు గురి చేస్తోంది. ప్రపంచదేశాలను వణికిస్తున్న ఈ కోవిడ్ 19 కారణంగా రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆయా దేశాలు ఎన్ని ముందస్తు చర్యలు చేపడుతున్నా.. ఈ మహమ్మారిని మాత్రం జయించలేకపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 422,743 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 18,902 మంది మృత్యువాత పడ్డారు. ఇక 109,102 మంది ఈ మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు.

అత్యధికంగా ఇటలీలో 6,820 మంది మృతి చెందగా.. నిన్న ఒక్కరోజులోనే ఆ దేశంలో 740 మంది ప్రాణాలు విడిచారు. అటు చైనాలో ఈ వ్యాధి బారిన పడి 3,281 మరణించగా, స్పెయిన్‌లో 2,991 మంది, ఇరాన్‌లో 1,934 మంది, ఫ్రాన్స్‌లో 1,100, అగ్రరాజ్యం యూఎస్ఏలో 778 మంది, యూకేలో 422, నెదర్లాండ్స్‌లో 276 మంది, జర్మనీలో 159 మంది, స్విట్జర్లాండ్‌, బెల్జియంలలో 122 మంది, దక్షిణకొరియాలో 120 మంది చనిపోయారు.

ఈ వ్యాధి కారణంగా దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటించడమే కాకుండా ప్రజలు ఇంటి నుంచి బయటికి రాకుడదని విజ్ఞప్తి చేశాయి. డబ్ల్యూహెచ్ఓ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడంతో ప్రపంచం కుదేలవుతోంది. కొన్ని దేశాల్లో అయితే ఈ కరోనా వైరస్ మహమ్మారి మూడు, నాలుగు దశల్లోకి సంక్రమించడంతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. కాగా, భారతదేశం కూడా లాక్ డౌన్ అయింది. ప్రధాని మోదీ అందరిని ఇళ్లకే మూడు వారాల పాటు పరిమతం కావాలని విజ్ఞప్తి చేశారు.

For More News:

ఏపీలో మరో కరోనా కేసు…

కొత్తగూడెం పోలీస్ అధికారి, వంట మనిషికి కరోనా.. 39కి చేరిన కేసులు..

ఇండియా లాక్ డౌన్.. ఏ సేవలకు బ్రేక్.? ఏవి ఉంటాయి.?

‘ఇంటికి రావద్దు ప్లీజ్’.. కరోనా అనుమానితుల ఇళ్లకు రెడ్ నోటిసులు..

దేశంలో మొట్టమొదటి కోవిడ్ 19 ఆసుపత్రి.. రిలయన్స్ సంచలనం..

కేటీఅర్ అన్నా.. మా ఊరికి పంపండి.. సోదరి విజ్ఞప్తి..

జక్కన్న అదిరిపోయే ఉగాది ట్రీట్.. ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ లోగో విడుదల..

ఈ లక్షణాలు ఉన్నా.. కరోనా వైరస్ సోకినట్లే..!

గుడ్ న్యూస్.. కరోనాలా హంటా వైరస్ కాదట… అసలు నిజమిదే.!