ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే..!

|

Jan 10, 2021 | 7:58 PM

Corona Cases AP: ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 50,027 సాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 227 పాజిటివ్ కేసులు..

ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే..!
Follow us on

Corona Cases AP: ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 50,027 సాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 227 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 289 మంది కరోనా నుండి కోలుకుని ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ కాగా.. ఒక్కరు మరణించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 8,84,916కు చేరింది. వీరిలో 8,75,243 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 2544 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 7129 మంది చనిపోయారు. నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 14, చిత్తూరు 22, తూర్పుగోదావరి 17, గుంటూరు 50, కడప 7, కృష్ణా 38, కర్నూలు 23, నెల్లూరు 7, ప్రకాశం 5, శ్రీకాకుళం 7, విశాఖపట్నం 19, విజయనగరం 8, పశ్చిమ గోదావరి 10 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.