Corona Cases India: దేశంలో గడిచిన 24 గంటల్లో 18,177 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,23,965 చేరుకుంది. ఇందులో 2,47,220 యాక్టివ్ కేసులు ఉండగా.. 99,27,310 కరోనా నుంచి కోలుకున్నారు. ఇక తాజాగా 217 మంది వైరస్ కారణంగా చనిపోవడంతో.. దేశంలో ఇప్పటివరకు 1,49,435 కరోనా మరణాలు సంభవించాయి.
అటు గత కొద్దిరోజులుగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల లేకపోవడం ఊరటను ఇచ్చే అంశం. అన్ని రాష్ట్రాల్లోనూ రికవరీ రేటు పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో బుధవారం 20,923 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 2.39 శాతానికి తగ్గాయి. మరణాలు రేటు 1.45 శాతానికి తగ్గింది. దేశంలో 96.16 శాతానికి రికవరీ రేటు చేరిందంది.