దేశంలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 29,398 పాజిటివ్ కేసులు, 414 మరణాలు.. పెరుగుతున్న రికవరీ రేటు..
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 29,398 పాజిటివ్ కేసులు, 385 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 97,96,770కు చేరింది.
Corona Cases India: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 29,398 పాజిటివ్ కేసులు, 385 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 97,96,770కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 3,63,749 ఉండగా.. ఇప్పటివరకు 92,90,834 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న దేశవ్యాప్తంగా 414 మంది మృతి చెందటంతో మొత్తం ఇప్పటివరకు వైరస్ కారణంగా 1,42,186 మంది ప్రాణాలు కోల్పోయారు.
అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. పలు రాష్ట్రాల్లో తప్పితే మిగిలిన చోట్ల పాజిటివ్ కేసుల కంటే రికవరీ రేటు అధికంగా ఉంటోందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 37.528 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది.కాగా, దేశంలో 94.84 శాతానికి రికవరీ రేటు చేరిందంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 3.71 శాతానికి తగ్గాయి. మరణాలు రేటు 1.45 శాతానికి తగ్గింది.
Also Read: రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. పలు స్పెషల్ ట్రైన్స్ సమయాల్లో మార్పు.. కీలక సమాచారం ఇదే..