AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Andhra: ఏపీలో రెడ్ జోన్‌లోకి 97 ప్రాంతాలు.. వివరాలివే.!

Corona Andhra: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 30 వేలకు చేరువైంది. 15,412 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 328కి చేరింది. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెడ్ జోన్ ప్రాంతాల వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. మొత్తంగా 97 ప్రాంతాలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నట్లు అధికారులు […]

Corona Andhra: ఏపీలో రెడ్ జోన్‌లోకి 97 ప్రాంతాలు.. వివరాలివే.!
Ravi Kiran
|

Updated on: Jul 12, 2020 | 6:50 PM

Share

Corona Andhra: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 30 వేలకు చేరువైంది. 15,412 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 328కి చేరింది. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెడ్ జోన్ ప్రాంతాల వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. మొత్తంగా 97 ప్రాంతాలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు సమాచారం. ఆయా ప్రాంతాల్లో ఈ నెల 20వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం అధికారులను సూచించింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి..

  • విశాఖ జిల్లా: వైజాగ్ సిటీ, పద్మనాభం, నర్సీపట్నం
  • తూర్పుగోదావరి జిల్లా: శంఖవరం, కొత్తపేట, కాకినాడ, పిఠాపురం, రాజమండ్రి, అడ్డతీగల, పెద్దాపురం
  • పశ్చిమగోదావరి జిల్లా: ఏలూరు, పెనుగొండ, భీమవరం, తాడేపల్లిగూడెం, ఆకివీడు, భీమడోలు, ఉండి, కొవ్వూరు, నరసాపురం
  • కృష్ణా జిల్లా: విజయవాడ, పెనమలూరు, జగ్గయ్యపేట, నూజివీడు, మచిలీపట్నం
  • గుంటూరు జిల్లా: గుంటూరు, నరసరావుపేట, మాచర్ల, అచ్చంపేట, మంగళగిరి, పొన్నూరు, చేబ్రోలు, దాచేపల్లి, కారంపూడి, క్రోసూరు, మేడికొండూరు, తాడేపల్లి
  • కర్నూలు జిల్లా: కర్నూలు, నంద్యాల, బనగానపల్లి, పాణ్యం, ఆత్మకూరు, నందికొట్కూరు, కోడుమూరు, శిరువెళ్ల, చాగలమర్రి, బేతంచెర్ల, గడివేముల, గూడూరు, ఓర్వకల్లు, అవుకు, పెద్దకడుబూరు, ఉయ్యాలవాడ, ఎమ్మిగనూరు
  • ప్రకాశం జిల్లా: ఒంగోలు, చీరాల, కారంచేడు, కందుకూరు, గుడ్లూరు, కనిగిరి, కొరిసపాడు, మార్కాపురం, పొదిలి
  • నెల్లూరు జిల్లా: నెల్లూరు, నాయుడుపేట, వాకాడు, తడ, అల్లూరు, ఇందుకూరుపేట, బాలాయపల్లె, బోగోలు, బుచ్చిరెడ్డిపాళెం, గూడూరు, కావలి, కోవూరు, ఓజిలి, తోటపల్లి గూడూరు
  • చిత్తూరు జిల్లా: శ్రీకాళహస్తి, తిరుపతి, నగరి, పలమనేరు, రేణిగుంట, నిండ్ర, వడమాలపేట, ఏర్పేడు
  • కడప జిల్లా: ప్రొద్దుటూరు, కడప, బద్వేలు, పులివెందుల, మైదుకూరు, వేంపల్లె, ఎర్రగుంట్ల
  • అనంతపురం జిల్లా: హిందూపురం, అనంతపురం, కళ్యాణదుర్గం, కొత్తచెరువు, సెట్టూరు

Also Read:

 కరోనా కట్టడిలో జగన్ సర్కార్ దూకుడు.. ఇంటికే ఉచితంగా కరోనా కిట్..

విద్యార్ధులకు ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

హెచ్‌సీయూ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. నో ఎగ్జామ్స్.. ఓన్లీ గ్రేడింగ్.!

ఏపీ: ఆగష్టు 3 నుంచి ఇంటర్ కళాశాలల రీ-ఓపెన్.. 196 పనిదినాలు..!