ఈజీగా బరువుతగ్గాలనుకుంటున్నారా..? ఈ పండుతో డైట్ ప్లాన్ చేయండి.. ఇమ్యూనిటీ పెరిగి.. బరువు తగ్గుతారు..

|

Mar 23, 2023 | 4:03 PM

ఒక కిలో పండులో దాదాపు 300 నుండి 350 కేలరీలు ఉంటాయి. అంతేకాదు ఇందులో 2 గ్రాముల కొవ్వు మాత్రమే ఉంటుంది. ఇందులో కొవ్వు శాతం తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి ఇది సరైన పండు అని చెప్పవచ్చు.

ఈజీగా బరువుతగ్గాలనుకుంటున్నారా..? ఈ పండుతో డైట్ ప్లాన్ చేయండి.. ఇమ్యూనిటీ పెరిగి.. బరువు తగ్గుతారు..
Eight Loss
Follow us on

అధిక బరువు, ఊబకాయం ప్రధాన ప్రజారోగ్య సమస్యలు. ఈ రోజుల్లో చాలా మంది తమ శరీరాన్ని ఒక నిర్దిష్ట ఆకృతిలో ఉంచుకోవాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం వారు తమ శరీర బరువును మెయింటెయిన్ చేసేందుకు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. జిమ్‌లో గంటల తరబడి చెమటలు పట్టిస్తుంటారు. బరువు తగ్గడానికి పలురకాల డైట్ పాటిస్తుంటారు. కానీ, అవేవీ పెద్దగా ప్రభావం చూపించవు. అయితే కొన్ని సింపుల్ హోం రెమెడీస్ పాటిస్తే మీరు మీ శరీర బరువు ఈజీగా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఈ సీజన్‌లో కొద్దిపాటి శారీరక శ్రమ అధిక చెమటకు దారితీస్తుంది. ఇది శరీరం నుండి అదనపు కొవ్వును తొలగించడానికి సహాయపడుతుంది. వేసవిలో కొవ్వు కరిగించుకోవడానికి బరువు తగ్గడానికి పుచ్చకాయను మంచి ఎంపికగా పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. పుచ్చకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

పుచ్చకాయ తినడం వల్ల బరువు తగ్గుతారా..?
బరువు తగ్గడానికి పుచ్చకాయ బెస్ట్ ఫ్రూట్ అంటున్నారు పోషకాహార నిపుణులు. పుచ్చకాయలో 90 శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. ఇతర వేసవి పండ్లతో పోలిస్తే పుచ్చకాయలో కేలరీలు కూడా తక్కువ. అందువల్ల ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఒక కిలో పుచ్చకాయలో దాదాపు 300 నుండి 350 కేలరీలు ఉంటాయి. అంతేకాదు ఇందులో 2 గ్రాముల కొవ్వు మాత్రమే ఉంటుంది. ఇందులో కొవ్వు శాతం తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి ఇది సరైన పండు అని చెప్పవచ్చు. పుచ్చకాయలో ఫైబర్, పొటాషియం, విటమిన్-సి, ఎ, బి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అలాగే ఈ పండు తింటే చాలా సేపు కడుపు నిండుగా ఉంటుంది. ఈ కారణంగా తరచుగా ఆకలి వేయదు. మీకు తరచుగా ఆకలి వేయదు కాబట్టి అదనపు కొవ్వు పదార్ధాలు, జంక్, ఫాస్ట్ ఫుడ్ తినవలసిన అవసరం ఉండదు. జంక్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్స్ కు దూరంగా ఉంటే బరువు తగ్గడం సులువవుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు, పుచ్చకాయ తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. ఇది బరువు నియంత్రణలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

బరువు తగ్గడానికి పుచ్చకాయను ఎలా తినాలి? :
బరువు తగ్గడానికి పుచ్చకాయను ఎలా తినాలో కూడా ఒక నియమం ఉంది. ఇష్టంగా తింటే బరువు తగ్గడం సాధ్యం కాదు. మీరు బరువు తగ్గాలనుకుంటే, మీరు అల్పాహారంగా పుచ్చకాయ తినాలి. అల్పాహారం కాకుండా రాత్రి భోజనంలో పుచ్చకాయను సలాడ్‌గా తీసుకోవచ్చు. రాత్రిపూట పుచ్చకాయను సలాడ్‌గా తినే వారు రాత్రికి మళ్లీ ఆకలి వేయకుండా ఉండాలంటే ఇంకేదైనా తినాలని నిపుణులు చెబుతున్నారు.

పుచ్చకాయ పండు బరువు తగ్గడానికి అనేక విధాలుగా తీసుకోవచ్చు. సలాడ్, జ్యూస్, స్మూతీస్, షేక్స్ రూపంలో తీసుకోవచ్చు. బరువు తగ్గడానికి మీరు ఎలాంటి డైట్‌ని అనుసరించినా, జంక్ ఫుడ్ తినకూడదనేది ఇక్కడ ప్రధాన నియమం. పుచ్చకాయ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కానీ, దానిని నిర్వహించడానికి, ఆహారం, శారీరక శ్రమపై ఎక్కువ శ్రద్ధ ఉండాలి. ఆరోగ్య సంబంధిత వార్తల కోసం..

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..